Login Password Register? Forgot passwd?
    Home  |  News  |  Gallery  |  Interviews  |  Reviews  |  Wallpapers  |  Music  |  Videos  |  Showtimes  |  Movies  |  Profiles                    21 Nov 2008


You are here: TotalTollywood >> Interviews
Archana Interview
11-Jun-2008



Related Links
Need help with Telugu font?
English Version
User Comments


అచ్చమైన తెలుగు అమ్మాయిలు తెలుగు చిత్రపరిశ్రమ లో కరువైపోతున్నారు అని దర్శకులూ నిర్మాతలూ సభల్లోనూ మీటింగుల లోనూ గగ్గోలు పెట్టేసినా తమ చిత్రాల వరకూ వచ్చేటప్పటికి మళ్ళీ ముంబాయో, చెన్నై యో పరిగెట్టేస్తూ వుంటారు. చక్కని అభినయ కౌశలం వుండి స్వతహాగా కూచిపూడి నర్తకి కూడా అయిన అర్చన అచ్చమైన తెలుగు అమ్మాయి అవ్వడం వల్లనే నేమో తెలుగులో తప్పా మిగిలిన అన్ని భాషల్లోనూ మంచి అవకాశాలు వస్తున్నాయి. పలు సూపర్ హిట్ చిత్రాలలో చక్కని పాత్రలు పోషించిన అర్చన ఇటీవల విడుదల అయిన పాండురంగడు చిత్రం లో ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ సంధర్భంగా ఆమె తో జరిపిన ఒక చిన్న భాతాఖానీ . . .



అర్చన గారూ పాండురంగడు చిత్రం గురించి చెప్పండి . . .



విజయం సాధించే ఏ చిత్రంలో అయినా భాగస్వామి కావడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. నావరకూ వస్తే రాఘవేంద్రరావు గారి రామదాసు లో గానీ ఇప్పుడు పాండురంగడు లో గానీ చాలా చక్కని పాత్రలు లభించాయి. ఇక భక్తి రస ప్రధాన చిత్రాలకు ఆదరణ అన్నది యెప్పుడూ వుంటుంది. ఈ చిత్రాలకు మాసు, క్లాసు అంటూ ఎటువంటి భేదాలూ వుండవు. చిన్న పల్లెటూర్లనుండి పెద్ద పట్టణాల వరకూ అందరూ చూసే చిత్రాలివి. అటువంటి రెండు విజయవంతమైన చిత్రాలలో నటించడం నిజంగా నా అదృష్టమనే చెప్పాలి.




కానీ పాండురంగడు చిత్రం విషయానికి వస్తే ఇందులో కాస్త అశ్లీలం పాలు యెక్కువ అయ్యిందని అంటున్నారు. . . ముఖ్యంగా టబు పాత్ర గురించి . . . దీనిపై మీ కామెంట్ . . .



అశ్లీలం అంటే నిజానికి అది ఆ పాత్రను బట్టీ వుంటుంది. టబుది అటువంటి పాత్ర అయినపుడు మరి అలానే వుంటుంది. అయినా ఇప్పుడు వస్తున్న చిత్రాలతో పోలిస్తే ఇందులో అశ్లీలమేమీ పెద్దది కాదు అనే చెప్పాలి. అయినా రాఘవేంద్రరావు గారు దేన్నైనా అందంగా చూపించడం లో సిద్దహస్తులు అని అందరికీ తెలిసిందే కదా . . .




అచ్చతెలుగు అమ్మాయి అయి వుండీ మీరు ఎక్కువ చిత్రాలు చేయలేక పోవడానికి కారణం ఏంటి ?



(నవ్వుతూ) తెలుగు అమ్మాయి ని అవ్వడ మే కారణమేమో. . . అలా అని కాదు గానీ. . . ఏమో మరి కారణం అంటే నాకూ తెలియదు మరి . . . మళ్ళీ నేను చేసిన చిత్రాలు చాలా వరకూ మంచి విజయాలు సాధించిన చిత్రాలే . . . అయినా ఈ ప్రశ్న మీరు నన్ను కాదు అడగాల్సింది. but any how ఇప్పుడు నేను ఎక్కువ సినిమాలే చేస్తున్నాను.



ప్రస్తుతం మీరు చేస్తున్న చిత్రాల వివరాలు చెప్పండి . . .



తెలుగులో ఒకటి, తమిళ్ లో రెండు, కన్నడంలో రెండు చేస్తున్నాను. కన్నడంలో నేను ఇటీవల చేసిన " ఆదినగరు " చాలా పెద్ద విజయాన్ని సాధించింది. ఇక పోతే ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాలు కూడా పెద్దవే. తెలుగులో వచ్చిన పొగరు చిత్రాన్ని కన్నడలో రీ మేక్ చేస్తున్నారు. .అందులో నేను శ్రేయా రెడ్డి పాత్ర పోషిస్తున్నాను.



తమిళం, కన్నడం అంటున్నారు . . . మీరు తెలుగు అమ్మాయి కదా మరి భాష తో ప్రోబ్లం ఏమీ లేదా . . .




అలాంటిదేమీ లేదు. తమిళ్ చాలా ఈజీ, ఇక కన్నడ కూడా తొందరగానే అర్ధం అయిపోతుంది. అయినా తెలుగులో తమిళం వాళ్ళూ, మళయాళం వాళ్ళూ యెలా చేస్తున్నారు ? నేనూ అంతే . . .



సినిమాలు చేస్తూనే టి.వి. షొ కూడా చేస్తున్నారు . . దానివల్ల మీ కెరీర్ కి ప్రోబ్లం ఏమీ లేదా . . .



అలాంటిది ఏమీ లేదు. అయినా నేను ఏదో సీరియల్ లోనూ మరో దాన్లోనో చేయడం లేదు కదా. . . ఒక స్టేచర్ వున్న వాళ్ళతో కలిసి వర్క్ చేస్తున్నాను . . దానికి తోడు ఆ ప్రోగ్రాం ఎంత పెద్ద సక్సస్సో అందరికీ తెలిసిందే . . .అయినా టి.వి. లో చేస్తే సినిమా అవకాశాలు తగ్గిపోతాయి అని నేను అనుకోను . . .



మీరు కధలు ఎలా ఎంపిక చేసుకొంటూ వుంటారు . . .




ఇంత వరకూ ఆ విషయం పెద్ద శ్రద్ద చూపలేదు గానీ ఇప్పుడు అన్నీ జాగ్రత్తగా చూస్తున్నాను . . నా పాత్ర ప్రాధాన్యత ఏంటి, అది నాకు ఎంత వరకూ ఉపయోగ పడుతుంది లాంటి విషయాల మీద ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నాను . . .



మీరు నరేష్ కలిసి చదువుకొన్నారన్నది నిజమేనా . . .



I just don't know అసలు ఇలాంటివన్నీ ఎలా వస్తాయో . నాకూ నరేష్ కు వున్న కామన్ ఫ్రెండ్ ఒక సారి వాళ్ళు నేను సినిమాకి హీరోయిన్
కోసం చూస్తున్నారని తెలిసి నువ్వెందుకు ట్రై చేయకూడదు అని నన్నూ, అలాగే నేను హీరోయిన్ గా బావుంటానేమో అని వాళ్ళకూ చెప్పారు. నిజానికి నేను
దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. అయితే ఒక రోజు వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళడం అక్కడే ఒక చిన్న ఫార్మల్ ఫొటోషూట్ జరపడం
and then నన్ను హీరోయిన్ గా సెలెక్ట్ చేయడం అంతా ఒక్క రోజులో జరిగిపోయింది. అంతే తప్పా నేనూ నరేష్ క్లాస్ మేట్స్ అనడం మాత్రం నిజం కాదు . . .




మీకు అప్పటికి నటన లో ఏమైనా అనుభవం వుందా . . .



ప్రత్యేకమైన అనుభవం అంటూ ఏమీ లేదు కానీ నాకు కూచిపూడి మంచి ప్రవేశం వుండడం వల్ల హావభావాల విషయం లో పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదు. దానికి తోడు స్కూల్ టైం నుండీ నేను కల్చరల్ ప్రోగ్రామ్స్ లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం వల్ల కూడా నాకు కెమెరా ముందు పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదు అని చెప్పాలి . . .



మీ పేరు విషయం లో చాలా మార్పులు జరిగాయి దానికి ప్రత్యేక కారణాలు ఏమన్నా వున్నాయా . . .



చాలా మార్పులు ఏమీ కాదు. నా అసలు పేరు అర్చన . . . అయితే " నేను " సినిమా టైం లో ఆ చిత్ర దర్శకుడు సత్తిబాబుగారు . . అప్పటికే ఆ పేరు తో ఇంకొకరు వున్నారు కదా అందుకని నీ పేరు ని
వేద గా మార్చుకోవచ్చు కదా అని అన్నారు. దానికి నేను కూడా బాగా ఎగ్జైట్ అయ్యాను . . పేరు మార్చుకోవడం అన్నది అప్పుడు చాలా సరదాగా అనిపించింది. కానీ తర్వాత నేను ఆ పేరు తో రిలేట్ కాలేక పోయాను . . నా స్నేహితులందరూ నన్ను అచ్చూ అనీ అర్చన అని పిలుస్తూ వుంటారు . అదే అలవాటు . . ఈ వేద పేరుకి నేను అలవాటు పడలేకపోయాను . . అందుకే మళ్ళీ అర్చన గానే కంటిన్యూ అయిపోయాను.. అంతే . . .




కూచిపూడి లో మంచి ప్రవేశం వుంది అన్నారు . . . మరి ఇప్పటి వరకూ ఏమన్నా ప్రోగ్రాం చేసారా . . .



చేసాను . . . నా ఆరంగ్రేటం రవీంధ్ర భారతి లోనే జరిగింది . . అలాగే విదేశాల్లొ కూడా కొన్ని షో లు చేసాను . . . నేను ఎక్కువగా " భో శంభో " అన్న ఐటం ని చేసాను . . and moreover ఇప్పుడు కూడా ఒక ప్రోగ్రాం చేయాలి అనుకొంటున్నాను . . త్వరలోనే బహుశా శిల్పకళావేదిక లో గానీ రవీంద్ర
భారతి లో గానీ ఒక ప్రోగ్రాం చేస్తాను . . .




సినిమాలు చూస్తుంటారా . . . .



చాలా . . . అయితే యెక్కువగా హిందీ సినిమాలు చూస్తాను, హాలీవుడ్, ఇరానియన్, ఫ్రెంచ్ సినిమాలు కూడా చూస్తుంటాను . . .



మీ అభిమాన నటీ, నటులు ఎవరు . . . .



అభిమాన నటి అంటే . . no doubt its Sreedevi . . . ఇక అభిమాన నటుడు అంటే మాత్రం సినిమా సినిమా కీ మారి పోతూ వుంటారు . . . మొన్న
జోధా అక్బర్ చూసినప్పటి నుండీ అయితే హ్రుతిక్ రోషన్ .




మీరు తప్పకుండా చేయాలి అనుకొన్న డ్రీమ్ రోల్ ఏమన్నా వుందా . . .



రోల్ కాదు రోల్స్ వున్నాయి . . . అందులో ఒకటి ఇప్పుడు కన్నడాలో చేస్తున్నాను
. . అదే పోగరు లోని శ్రేయా రెడ్డి పాత్ర . . . అలాంటివి ఇంకా చాలా వున్నాయి
. . .




OK అర్చన గారూ మీరు మీ డ్రీమ్ రోల్స్ అన్నిటినీ ప్లే చేసే అవకాశాలు మీకు త్వరలోనే రావాలని ఆకాంక్షిస్తూ

Other latest in News
Actor turned Director : G V
Interview with Rajendra Prasad
Interview with Udaykiran
Chat with RGV on his new film and Raksha
Interview with Puri Jagannath
Gopichand
RGV on Raksha
Nikhil talks about Ankit, Pallavi & Friends
Nagarjuna
Interview with JD on Homam
Industry should stand united: Suresh Babu
No exposing; Not for money or career : Ullal
POST YOUR COMMENT

Subject/Headline
Comment
PUBLIC OPINION
Total number of reviews - 1

hi veda
by srikanth on 2008-06-12
Rating:

u r so cute and ur acting was very good in all films and u r so sexy

SEE ALL REVIEWS >>



Help reading Telugu font? Telugu text is Unicode encoded. If you have any problems viewing the Telugu text in the article, set the character encoding to Unicode in your browser. In Mozilla, this is accessible from View->Character Encoding->Unicode

Syndicate  |   Contact us  |   Disclaimer  |   Feedback
Copyrights © 2002-2006 TOTALTOLLYWOOD.COM. ALL RIGHTS RESERVED.