Login Password Register? Forgot passwd?
    Home  |  News  |  Gallery  |  Interviews  |  Reviews  |  Wallpapers  |  Music  |  Videos  |  Showtimes  |  Movies  |  Profiles                    04 Jul 2009


You are here: TotalTollywood >> Interviews
Chat with RGV on his new film and Raksha
28-Sep-2008

Chat with RGV on his new film and Raksha


Related Links
Need help with Telugu font?
User Comments

ఫూంక్ చిత్రం తో విజయం సాధించి కూడా అదే కధ తో రూపొందించిన రక్ష ను కూడా విజయపధం లో నడిపిన ఘనత రామ్ గోపాల్ వర్మదే. రక్ష మంచి విజయాన్ని సాధించిన సందర్భం లో ఆ చిత్రం యూనిట్ ఒక సక్సస్ మీట్ ను ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో గల పాయిజన్ పబ్ లో జరిపింది. ఈ సందర్భం గా ఆ చిత్ర యూనిట్ సభ్యులందరూ రక్ష చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు తమ ధన్యవాదాలు తెలియజేసారు. ఈ సందర్భం గా ధర్మ రక్ష అనే ఇద్దరు నూతన దర్శకులను తెలుగు తెరకు పరిచయం చేస్తూ రామ్ గోపాల్ వర్మ నిర్మించనున్న "రక్త చరిత్ర" చిత్రం పోస్టర్ ను జగపతి బాబు, రామ్ గోపాల్ వర్మ లు సంయుక్తం గా ఆవిష్కరించారు. ఈ సందర్భం గా రామ్ గోపాల్ వర్మ తో జరిపిన చిన్న చాట్ . . . .



ఫూంక్ చిత్రాన్నే రక్ష గా మలచి కూడా మీరు విజయాన్ని సాధించారు . . . నిజానికి ఒకే కధ తో రెండుసార్లు ప్రేక్షకులను ఎలా ఒప్పించగలిగారు?

నిజానికి కధ అన్నది రెండింటికీ ఒక్కటే అయినా దాన్ని తెరమీద చూపించిన విధానాలు వేరువేరు. ఫూంక్ చిత్రాన్ని నా స్టైల్ లో నేను తీస్తే, ఆ చిత్రం ప్రభావం ఏమాత్రం లేకుండా వంశీ తన స్టైల్ లో రక్షను తీసాడు. ప్రేక్షకులు ఒక కొత్తదనాన్ని చూడగలిగారు గనుకే ఈ రోజు రక్ష ఇంతటి విజయాన్ని సాధించగలిగింది. నిజం చెప్పాలంటే వంశీ కి ఫూంక్ తీసిన విధానం నచ్చలేదు. కానీ నాకు మాత్రం రక్ష చాలా బాగా నచ్చింది. రెండింటి మధ్యనా తేడా అన్నది లేకపోతే ప్రేక్షకులు రక్షని ఆదరించేవారు కాదు. ఈ రక్ష సక్సస్ క్రెడిట్ అంతా వంశీ ఆకెళ్ళకే దక్కుతుంది అనడం లో సందేహం లేదు.

కొంతమంది చేతబడి వుంది అని మీరు రుజువు చేస్తే మీకు పది లక్షలు ఇస్తామని అన్నారు . . .

అవును నేనూ విన్నాను. నేను ఇచ్చే ఆఫర్ ఏంటీ అంటే చేతబడి వుంది అని ఎలా ప్రూవ్ చేయగలమో చెబితే వారికే నేను ఇరవై లక్షలు ఇస్తాను. (నవ్వుతూ) అవును మరి నాకా చేతబడి ఎలా చేయాలో తెలీదు. సో అలాంటప్పుడు అది వుంది అని ఎలా ప్రూవ్ చేయగలను, అందుకే వారు నాకు దాని గురించి చెబితే నేనే వారికి ఎదురు ఇస్తాను. నిజానికి నన్ను అలా అడిగిన వారు అసలు రక్ష చిత్రాన్ని చూడలేదేమో అనుకొంటున్నాను. ఎందుకంటే చేతబడి అన్నది ఒక మూఢ నమ్మకమే అని ఈ సినిమాలో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇదేదో హర్రర్ సినిమా అనీ దెయ్యం భూతాల సినిమా అనీ అనుకొని చూడడానికి వచ్చినవారు ఈ చిత్రం లో వున్న హ్యూమన్ రిలేషన్స్ ఎండ్ ఎమోషన్స్ ని ఎంజాయ్ చేయడం వల్లనే ఈ చిత్రానికి విజయం చేకూరింది తప్పా, చేతబడి వల్ల ఏమాత్రం కాదు అని ఈ సవాల్ విసిరే వాళ్ళు గ్రహించాలి.

ఈ సినిమాని బ్యాన్ చేయాలని కొందరంటున్నారు . . దానికి మీరేమంటారు . . .

నేనా . . . నేనేమంటాను . . అలా బ్యాన్ చేయమని అడిగేవారిని బ్యాన్ చేయమంటాను . . .

మీరు తెలుగులో డైరెక్ట్ చేయబోయే చిత్రం ఎప్పుడు? దయచేసి త్వరలో అని మాత్రం చెప్పకండి ఎందుకంటే చాలా సంవత్సరాలనుండీ అదే సమాధానం వినీ వినీ బోర్ కొట్టేసింది . . .

(నవ్వుతూ) మీరు వద్దు అన్నా ఈ ప్రశ్నకు నా సమాధానం త్వరలోనే. డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ ఒక ప్రాజెక్ట్ వుంటుంది.

అయితే మీడియా మీద మీరు తీయబోయే చిత్రం అదేనా?

కాదు. మీడియా మీద ఆల్ రెడీ నేను సినిమా తీయబోతున్నాను. కాకపోతే హిందీ లో తీస్తున్నాను. ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది.

టెక్నికల్ గా పదేళ్ళు ముందుండే మీరు కధ ల విషయం లో ఇరవై ఏళ్ళు వెనక్కి వెళుతున్నారెందుకని?

అంటే మీరు రక్ష గురించి అంటున్నారా? దేని గురించి అనుకొన్నా ఒకటి మాత్రం నిజం. కధ కి ఏజ్ తో సంభందం వుండదు. అలా అయితే ఇప్పుడు రామాయాణ, భారత కధలను బేస్ చేసుకొన్న చిత్రాలు రానే రాకూడదు. కధా కాలం ఎప్పటిది అన్నది విషయం కానేకాదు. దానిని ఎలా ప్రెజెంట్ చేసారు అన్నదే ముఖ్యం.

మీరు నిర్మించబోయే తదుపరి చిత్రం ఏంటి?

నేను తెలుగులో రక్ష తర్వాత నిర్మించబోయే చిత్రం రక్త చరిత్ర. ధర్మ రక్ష అనే ఇద్దరు కొత్త దర్శకులతో ఈ చిత్రం చేస్తున్నాను. కాస్టింగ్ కూడా అంతా కొత్తవారే.

ఈ రక్త చరిత్ర చిత్రాన్ని పరిటాల రవి కధ ఆధారం గా తీస్తున్నారన్న కధనాలు వున్నాయి?

ఇది ఫ్యాక్షనిజం గురించి తీసిన చిత్రమే గానీ ఎవర్నీ వుద్దేశించి తీసింది కాదు. దీన్ని గురించి చెప్పాలంటే యధార్ధ వ్యక్తులు, యధార్ధ సంఘటనలతో కూర్చిన అత్యంత నిజమైన కల్పిత కథే ఈ రక్తచరిత్ర. ఇంతకన్నా దీనిగురించి నేను చెప్పదలచుకోలేదు.

నిజమైన అంటూనే కల్పితం అంటున్నారు, రెండిటికీ పొంతన లేదే?

అక్కడే వుంది మరి, అందులో వున్న పన్ తెలుసుకొంటే ఈ ప్రశ్న వుండదు.

ఈ చిత్రానికి పరిటాల రవి గారి భార్య సునీత గారు ఫైనాన్స్ చేస్తున్నారనీ, ఈ సినిమాకు సంభందించి మీరు మద్దెలచెర్వు సూరి ని కూడా కలిసారని వార్తలు వినవస్తున్నాయి. దీనికి మీరేమంటారు?

మీరేదో నన్ను ఫ్యాక్షనిస్ట్ ల చేత మర్డర్ చేయించేటట్లున్నారే. అలాంటిదేమీ లేదు ఈ మూవీ జెడ్ త్రీ బ్యానర్ మీద నిర్మించబడుతుంది. నేనే సూరి నీ కలవలేదు. ఆ వార్తలన్నీ రూమర్సే తప్పా మరేంకాదు. ధర్మ రక్ష లు ఈ కధ ను నాకు చెప్పినపుడు బాగా నచ్చింది. దానికి తోడు వారు దీని గురించి అని కలక్ట్ చేసుకొన్న మెటీరియల్ చూసినతర్వాత దీన్ని చెడగొట్టడానికి వారు కష్టపడాలి గానీ బాగా తీయడానికైతే కాదు అనిపించింది. అందుకే దర్శకులతో పాటూ మిగతా క్యారెక్టర్లు కూడా ఎటువంటి ఇమేజ్ లేని వారితోనే చేయాలని దీనిని అంతా కొత్తవారితో ప్లాన్ చేసాను.

షూటింగ్ రాయలసీమ లోనే జరపనున్నారా?

అవును. షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం అవుతుంది.

అంతా కొత్తవారితోనే అన్నారు, కానీ ఇందులో మెయిన్ లీడ్ గా జగపతి బాబు ని అనుకొన్నారని తెలిసింది?

లేదు అలా ఎప్పుడూ అనుకోలేదు. ఈ సినిమాకి కొత్తవారైతేనే బాగుంటుంది అని మొదటి నుండీ అనుకొంటున్నదే.

హిందీ లో ఫూంక్ ని తీసి దాన్ని తెలుగులో రక్ష అన్నారు. మరి ఇప్పుడు తెలుగులో రక్త చరిత్ర తీస్తున్నారు, మరి దాన్ని ఖూన్ చరిత్ అనేమన్నా హిందీ లో తీసే ఆలోచనేమన్నా చేస్తున్నారా?

(నవ్వుతూ) లేదు. ఎందుకంటే కొన్ని కధలు కొన్ని చోట్ల తీస్తేనే ఆకట్టుకొంటాయి.

ఈ సినిమాలో మెయిన్ లీడ్ ని విలన్ గా చూపిస్తున్నారా, హీరోగానా?

ఒక వ్యక్తి లోని మంచి గానీ చెడు గానీ దానిని మనం రిసీవ్ చేసుకొనేదానిని బట్టీ వుంటుంది. ఒకరికి మంచి అయ్యింది మరొకరికి చెడు కావచ్చు. అయినా ఇటువంటి విషయాలు మీరు సినిమాని చూసి తెలుసుకోండి.

చివరిగా ఈ సినిమాలో మీ ప్రమేయం ఎంతవరకూ వుంటుందో చెప్పండి?

నా ప్రమేయం అంటూ ఏమీ వుండదు. నేను కేవలం నిర్మాతను మాత్రమే.

(ఇంతటితో మా మద్య జరిగిన సంభాషణ ముగిసింది. ధర్మ, రక్ష లు ఇద్దరూ కలిసి దర్శకత్వం వహించనున్న ఈ రక్త చరిత్ర షూటింగ్ త్వరలోనే మొదలు కానున్నది. దీనికి సంభందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో వున్నాయి. రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు దగ్గరనుండే కాంప్లిమెంట్ అందుకొన్న ఈ దర్శకద్వయం మరి ఈ రక్త చరిత్ర ను ఎలా తీర్చి దిద్దుతారు అన్నది సినిమా చూసితెలుసుకోవాల్సిందే).

Raksha - Jagapati Babu, Kalyani - Movie Stills, Raksha - Movie Stills, RGV @ Raksha Pressmeet - Exclusive, Raksha Pressmeet - Events, Raksha wallpapers - Wallpapers,
Other latest in News
Actor turned Director : G V
Interview with Rajendra Prasad
Interview with Udaykiran
Chat with RGV on his new film and Raksha
Interview with Puri Jagannath
Gopichand
RGV on Raksha
Nikhil talks about Ankit, Pallavi & Friends
Nagarjuna
Interview with JD on Homam
Industry should stand united: Suresh Babu
No exposing; Not for money or career : Ullal
POST YOUR COMMENT

Subject/Headline
Comment
PUBLIC OPINION
No comments posted so far



Help reading Telugu font? Telugu text is Unicode encoded. If you have any problems viewing the Telugu text in the article, set the character encoding to Unicode in your browser. In Mozilla, this is accessible from View->Character Encoding->Unicode

Syndicate  |   Contact us  |   Disclaimer  |   Feedback
Copyrights © 2002-2006 TOTALTOLLYWOOD.COM. ALL RIGHTS RESERVED.