TotalTollywood Logo
20 Apr 2014
Login Password Register? Forgot passwd?


You are here: TotalTollywood >> Interviews
Gopichand
23-Sep-2008

Gopichand


Related Links
Need help with Telugu font?
English Version
User Comments

గోపీచంద్, అనూష్క లు జంట గా భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై శివకుమార్ దర్శకత్వం లో ఆనంద్ ప్రసాద్ నిర్మించిన చిత్రం శౌర్యం. ఈ చిత్రం ఈ నెల 25 న విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ చిత్రం హీరో గోపీచంద్ తో జరిపిన చిట్ చాట్ వివరాలు.



మీ ఒంటరి చిత్రం ఆశించినంత విజయాన్ని సాధించలేకపోయింది. . .

ఔనండీ . . . అయితే ఆ సినిమా అనుకొన్నప్పుడే రిజల్ట్ ఇలా కూడా వుండే అవకాశం వుందని మాకు తెలుసు. మరి తెలిసీ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే . . . కధ . . . అవును ఆ చిత్రం కధ అలాంటిది. హీరోయిన్ ని చంపేయడం అన్నది ఆ చిత్రం లో కీలకమైన పాయింట్. ఆ పాయింట్ ఆడియన్స్ లోనికి గనుక సరిగా వెళితే సినిమా సక్సస్ అవుతుంది, లేక పోతే వుండదు అని మాకు ముందే తెలుసు. తెలిసీ చేసిన ప్రయోగం అది. ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకొంటారు అన్న నమ్మకం తో మేము అలా చేసాము. కానీ అది మిస్ ఫైర్ అయ్యింది. సినిమా అంతటికీ అదే పెద్ద మైనస్ అయ్యింది.

మరి ఈ శౌర్యం చిత్రం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకొన్నారు . . . అసలు ఇది ఎలాంటి సినిమా . . .

పంచ భక్ష్య పరమాన్నం లాంటిది ఈ చిత్రం. ఇందులో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్సూ వున్నాయి. ఇది ఒక కంప్లీట్ కమర్షియల్ మూవీ. కామెడి, సెంటిమెంట్, యాక్షన్ అన్నీ సమపాళ్ళలో సరిగ్గా అమరిన చిత్రం ఇది. ఇక ఈ కధ లో నాకు అంతగా నచ్చిన అంశం ఎంటంటే కధనం. దర్శకుడు శివ నాకు కధ చెప్పిన విధానం నచ్చింది. ఆయన చెబుతుంటే నాకు నేను విజువలైజ్ చేసుకొని చూసాను. ఒక హీరో గా కాకుండా ఒక టిపికల్ ఆడియన్ గా చూసాను. నాకు నచ్చింది. ఏ కధనైనా నేను అలానే వింటాను. వేరే హీరోని అక్కడ ప్లేస్ చేసి నేను విజువలైజ్ చేసుకొంటాను, అప్పుడు నాకు బావుంది అనిపిస్తె ఒ.కె. లేదంటే లేదు.

సినిమాటోగ్రాఫర్ గా శివ తెలుసుగానీ దర్శకుడిగా కాదు. మీరు ఏ కాన్ఫిడెన్స్ తో అతనికి ఈ అవకాసాన్నిచ్చారు.

శివ నాకు కధ చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. కధను చెప్పెటప్పుడే నాకు మొత్తం సినిమా చూపించేసాడు. తీసే సీన్ లో గనుక కిక్ వుంటే దాన్ని మామూలు గా తీసినా బావుంటుది. ఆ కిక్ నాకు శివ చెప్పిన సీన్ల లో కనబడింది. డెఫినెట్ గా శౌర్యం తర్వాత శివ చాలా పెద్ద డైరెక్టర్ అయిపోతాడు. నెక్స్ట్ అంటే చెప్పలేను గానీ నేను శివ తో ఇంకో సినిమా చేయడం మాత్రం ఖాయం.

మీకు కధ చెప్పాలంటే అందులో పూర్తిగా యాక్షన్ వుంటేనే వింటారని అంటున్నారు . . .

అదంతా ట్రాష్. కేవలం యాక్షన్ మాత్రమే వుంటే సినిమాలు ఆడవు. అయితే నాకు చెప్పే కధలో యాక్షన్ పార్ట్ మాత్రం వుండాలి. ఎందుకంటే నేను లవర్ బాయ్ టైప్ లో చేస్తే నన్ను ఎవరూ చూడరు. పోనీ నాతో లవ్ స్టోరీనే ప్లాన్ చేసినా అందులో కూడా యాక్షన్ మిక్స్ చేయాల్సిందే.

కానీ మీరు ఎప్పుడూ సాఫ్ట్ క్యారెక్టర్లు చేయడానికి ట్రై చేయలేదు కదా?

ఎందుకు చేయలేదు. ఓక్కడున్నాడు సినిమా అలా చేసిందే. మీరనొచ్చు అది క్లాస్ యెలా అవుతుంది అని. మీరే చూడండి అందులోని ఫైట్ లని పక్కన పెట్టి గనుక చూస్తే ఒక సాఫ్ట్ గయ్ పడే బాధలన్నీ వుంటాయి. మరి అది కూడా అంతగా క్లిక్ కాలేదు. ఒంటరి కూడా అంతే. సొ ప్రజలు నన్ను యెలా చూడాలనుకొంటున్నారో అలాంటి సినిమాలే చేయాలి మరి. నిజానికి నాకు తెలిసి క్లాస్ ఆడియన్ కీ మాస్ ఆడియన్ కీ అసలు తేడా ఏం వుండదు. పది రూపాయల టికెట్ కొన్నవాడికి ఏ ఎమోషన్స్ వుంటాయో వంద రూపాయల టికెట్ కొన్నవాడికీ అదే ఎమోషన్స్ వుంటాయి. కాకపోతే పది రూపాయలవాడు ఫీల్ అయితే నచ్చితే గట్టిగా విజిల్ వేయగలుగుతాడు పైన వున్నవాడు అలా చేయలేడు. అంతే గానీ ఎక్కడైనా బేసిక్ ఎమోషన్స్ ఒక్కటే.

ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ హీరో విలన్ని కొట్టును అన్న కాన్సెప్ట్ తోనే వస్తున్నాయి. ఈ సినిమాలో హీరో విలన్ ని ఎవరికోసం కొట్టును.

హీరో అన్న తర్వాత హీరోయిన్ ని కొట్టలేడు కదా, తప్పకుండా విలన్ నే కొట్టాలి. ఇక ఇందులో హీరో ఎందుకు కొట్టాడు అన్నది . . . . ఇంకెంత సేపండీ ఇంకోరోజు అంతే . . . రేపే సినిమా రిలీజ్ అయిపోతుంది చూసి తెలుసుకోండి (నవ్వుతూ)

మీకు కధ చెప్పేటప్పుడు ఇది బావుంది, దీన్ని ఇలా ఇంప్రొవైజ్ చేస్తే బావుంటుంది అని మీరేమన్నా చెబుతూ వుంటారా.

కధ విన్నప్పుడు అంతా నచ్చి ఏదైనా కొద్దిగా మిస్ అయినట్లు అనిపిస్తే డెఫినెట్ గా చెబుతాను. అందులో తప్పేం లేదు. సపోజ్ నేను చాలాకాలం నుండీ ఘాయల్ లాంటి ఒక సినిమా నేను చేస్తే బాగుంటుంది అనుకొనే వాడిని, బుజ్జి కూడా నాతో ఆ సినిమా తీస్తే బాగున్ను అని ఆలోచించాడు. ఆ టైమ్ లోనే వాసు అదే ప్యాటర్న్ లో వున్న లక్ష్యం కధ చెప్పాడు. సరిగ్గా సెట్ అయిపోయింది అనుకొన్నాం. ఇక ఆ కధలో ఒక చక్కని లవ్ యాంగిల్ కూడా మిక్స్ చేస్తే బావుంటుంది అనుకొన్నాం. మరి అవన్ని చేసిన తర్వాతనే ఆ సినిమా అంత చక్కగా వచ్చింది.

మీరు ప్రయోగాలకు సిద్దమే అంటున్నారు కదా, మరి తమిళం లో హిట్ అయిన గజని లాంటి సినిమాలని ఎందుకు చేయకూడదూ.

ఒకటి నిజమండి. గజని సినిమాకి వెళ్ళే ప్రేక్షకుడు ముందే ఇది డబ్బింగ్ సినిమా అన్న ఫిక్సేషన్ లోనికి వెళ్ళిపోతాడు. ఆల్రెడీ ఆ సినిమా అక్కడ పెద్ద హిట్ అన్న ధ్యాసలోనే చూస్తాడు. సొ ఏమాత్రం బాగున్నా చాలా బావుంది అన్న అభిప్రాయానికి వెంటనే వచ్చేసే అవకాశం వుంది. నా వుద్దేశ్యం ప్రకారం ఆ సినిమాని మన తెలుగు మాస్ హీరో ఎవరన్నా చేస్తే ఆ సినిమా రిజల్ట్ వేరేగా వుంటుంది.

మణిశర్మ తో నే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు.

అలా అని ఏం లేదు. ఇప్పటివరకూ ఆరు సినిమాలు చేసాను అందులో నాలుగు మ్యూజికల్ హిట్లు. కొందరు హీరోలకు కొందరు మ్యూజిక్ డైరెక్టర్లు అనుకోకుండానే మంచి మ్యూజిక్ ని ఇవ్వగలుగుతారు. నాకు మణిశర్మ గారు అలానే.

మీ నాన్నగారి బాటలో విప్లవాత్మక చిత్రాలు సందేశాత్మక చిత్రాలు తీసే వుద్దేశ్యం ఏమన్నా వుందా . . .

అలాంటి స్టోరీ రావాలి. వస్తే తప్పకుండా చేస్తాను. నాన్నగారు తీసినప్పుడు వున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. చెప్పేది సందేశమే అయినా దాన్ని కూడా వినోదాత్మకం గా చెబితేనే ప్రేక్షకులు చూస్తున్నారు. సొ ఇలా వీటన్నిటినీ బేరీజు వేసుకొని తప్పకుండా అలాంటి సినిమా చేస్తాను. నా దృష్టి లో సినిమా అంటే పూర్తిగా నవ్విస్తూ ఆఖర్లో ఒక గట్టి ఎమోషన్ తో అప్పటివరకూ హాయిగా నవ్వుతూ వున్న ప్రేక్షకుడిని కుదిపేయగలగాలి. అప్పుడు ఆ సినిమాకు తిరుగు వుండదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మోహన్ బాబు గారి అల్లుడుగారు సినిమా. నాకైతే అలాంటి సినిమాలే నచ్చుతాయి మరి. (నవ్వుతూ)

మీ పెళ్ళీ గురించీ, రొమాన్స్ గురించీ చాలా రూమర్స్ వస్తున్నాయి?

మీరే అంటున్నారు కదా రూమర్స్ అని ఇక వాటిని పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది. అలా రాసుకోవడం వల్ల వేరే వాడికి ఉపయోగం వుంటే రాసుకోనివ్వండి. నేను ఏంటో నాకుతెలుసు, ఏం చేయాలో నాకు తెలుసు అలాంటప్పుడు ఎవరో ఏదో అన్నారని అస్సలు పట్టించుకోను.

చివరిగా. . . సంవత్సరానికి రెండు ఒకటి చిత్రాలే చేసే మీకన్నా సంవత్సరం లో ఏడెనిమిది చిత్రాలు చేస్తున్న నరేష్ లాంటి హీరోలవల్లనే ఇండస్ట్రీ బాగుపడుతుంది అంటున్నారు. మరి మీసినిమాల సంఖ్య ఎందుకు పెంచుకోకూడదూ?

చెయ్యోచ్చు నేను కూడా సినిమాలు ఎడా పెడా చేసేయవచ్చు. కానీ అంత మంచి కధలు కావాలి కదా. ఏదో ఒక కధ చేసేస్తే అవి విజయవంతం అవ్వవు. మీకు ఈ రంగం లో ఒక్కసారి వెనకబడ్డారా ఇంకా అది అలానే కంటిన్యూ అయిపోతూ వుంటుంది. సొ వేసే ప్రతి అడుగూ జాగ్రత్తగానే వేయాల్సి వస్తుంది. ఇక్కడ సక్సస్ కి మాత్రమే విలువ వుంటుంది. దాన్ని కాపాడుకోవాలంటే మేము ఇలానే చేయాలి తప్పదు.

ఈ సినిమాలో పూనమ్ కౌర్ మీ చెల్లెలి గా నటించిందన్నారు?

ఎవరన్నారు . . . (నవ్వుతూ) మీరు ఎంత ట్రై చేసినా నేనైతే చెప్పను మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అయితే ఆమె మాత్రం చాలా మంచి క్యారెక్టర్ చేసింది. (అక్కడితో మా చిట్ చాట్ ముగిసింది)

Souryam - Movie Stills, Souryam Audio Release - Events, Anushka from Sowryam - Exclusive, Rachana Arya - Exclusive, Sowryam Platinum Disk - Events, Gopi @ SPD - Exclusive, Anushka @ SPD - Exclusive,
Other latest in News
Actor turned Director : G V
Interview with Rajendra Prasad
Interview with Udaykiran
Chat with RGV on his new film and Raksha
Interview with Puri Jagannath
Gopichand
RGV on Raksha
Nikhil talks about Ankit, Pallavi & Friends
Nagarjuna
Interview with JD on Homam
Industry should stand united: Suresh Babu
No exposing; Not for money or career : Ullal
POST YOUR COMMENT

Subject/Headline
Comment
PUBLIC OPINION
No comments posted so far



Help reading Telugu font? Telugu text is Unicode encoded. If you have any problems viewing the Telugu text in the article, set the character encoding to Unicode in your browser. In Mozilla, this is accessible from View->Character Encoding->Unicode

Syndicate  |   Contact us  |   Disclaimer  |   Feedback
Copyrights 2002-2006 TOTALTOLLYWOOD.COM. ALL RIGHTS RESERVED.