Login Password Register? Forgot passwd?
    Home  |  News  |  Gallery  |  Interviews  |  Reviews  |  Wallpapers  |  Music  |  Videos  |  Showtimes  |  Movies  |  Profiles                    21 Nov 2008


You are here: TotalTollywood >> Interviews
Nagarjuna
29-Aug-2008

Nagarjuna


Related Links
Need help with Telugu font?
English Version
User Comments

అవి టి.వి. షోలు కానివ్వండి, సినిమాలు కానివ్వండి లేక మరింకేదైనా కానివ్వండి, ప్రతి చోటా కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ, న్యూటాలెంట్ కి అవకాశాలు ఇవ్వడం లో ఎప్పుడూ ముందు వరుసలో వుండేది అక్కినేని నాగర్జున అని చెప్పడం లో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. అలాగే అటు ఆద్యాత్మక చిత్రాలు గానీ పక్కా మాస్ మసాలా చిత్రాలు గానీ రెండింటిలో ప్రజలను రంజింప చేయగలగడం కూడా ఆయనకే చెల్లింది. ప్రస్తుతం వినోదాత్మక చిత్రాలకు చిరునామా గా మారిన శ్రీను వైట్ల దర్శకత్వం లో వస్తున్న కింగ్ చిత్రం తన హలో బ్రదర్, శ్రీను ఢీ లు కలిస్తే ఎలా వుంటుందో అలా వుంటుందని నాగర్జున అంటున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన పలువిషయాల గురించి మాట్లాడారు. వాటి వివరాలు.

నాగర్జునగారూ మీకు మా టోటల్ టాలీవుడ్ బ్రౌజర్స్ తరపున అడ్వాన్సు గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

Thank you very much.

మిమ్మల్ని ఎప్పుడూ అందరూ అడిగే ప్రశ్నే, మీ గ్లామర్ రహస్యం?

(నవ్వుతూ) ఇదిగో ఎప్పుడూ ఇలా నవ్వుతూ కూల్ గా వుండడమే. అందం అనేది నాకు నాన్నగారినుండి వచ్చింది. దానికోసం అంటూ నేను ప్రత్యేకంగా ఎటువంటి శ్రద్దా తీసుకోను. సాధ్యమైనంతవరకూ ఎటువంటి టెన్షన్స్ నీ దగ్గరకి చేరకుండా చూసుకొంటాను అంతే . .

ఈ బర్త్ డే విశేషం ఎంటి?

వుంది. నిజానికి నేను చాలా హ్యాపీ గా వున్నాను. ఈ సంవత్సరమే నాగ చైతన్యను హీరోగా పరిచయం చేయబొతున్నందుకు. మా అబ్బాయి కూడా హీరో కాబోతున్నాడు అని తలచుకొంటేనే చాలా ఆనందంగా వుంది.

చైతన్యను వేరే బ్యానర్ లో పరిచయం చేస్తున్నారు??

మా బ్యానర్ లోనే పరిచయం చేయొచ్చు గానీ ప్రస్తుతం యూత్ ఫుల్ మూవీస్ ని ప్రెజెంట్ చేయడం లో దిల్ రాజు మంచి ప్రావీణ్యం సంపాదించాడు, దానికి తోడు కొత్తవారిని, వారిలో వున్న టాలెంట్ ని బయటకు తీసుకు రావడం లో కూడా ఆయన దిట్ట. ఇప్పటివరకూ తను చేసిన సినిమాల్లో మాగ్జిమం సినిమాల్లో కధ కు వున్న ప్రాధాన్యత ని చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. సో . . మా బ్యానర్ కన్న దిల్ రాజు అయితే ఇంకా బాగా ప్రెజెంట్ చేయగలడు అని అనుకొని అలా చేయడం జరిగింది.

చైతన్య కెరీర్ పరం గా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొంటున్నారు . .

మంచి కధలు చేయాలి. నిజానికి నా వరకూ నేను చైతన్య అన్ని రకాల క్యారెక్టర్స్ నీ చేయాలని కోరుకొంటున్నాను. అంటే ముందుగానే ఒక మాస్ ఇమేజ్ లోనో లేక ఒక లవర్ బాయ్ ఇమేజ్ లోనో ఇరుక్కుపోకుండా నిదానం గా ఎదగాలి అన్నది నా ఉద్దేశ్యం. అలా అయితేనే నటుడి గా ఒక గుర్తింపు పొందుతాడు.

ప్రస్తుతం మీరు చేస్తున్న కింగ్ విశేషాలు చెప్పండి?

ఇ.వి.వి. తో నేను చేసిన హలోబ్రదర్, శ్రీను ఢీ లు కలిస్తే ఎలా వుంటుందో అంత ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో వుంటుంది. ఇందులో నాది ఢిఫరెంట్ షేడ్స్ వుండే పాత్ర, ఒకటేమో క్రెడిట్ కార్డ్ కలెక్షన్లు చేసేపాత్ర, ఒకటి కింగ్, ఇక చివరిది బొట్టు శ్రీను పాత్ర. వాటి గురించి మీరేం అడగొద్దు, అడిగినా నేను చెప్పను. వాటిలో వుండే సస్పెన్స్ ఏంటి అన్నది మీరు సినిమా చూసినపుడు తెలుస్తుంది.

ఈ సినిమాకి కింగ్ అన్న టైటిల్ పెట్టడానికి ఏదైనా పర్టిక్యులర్ రీజన్ వుందా?

ఈ కింగ్ అన్నది మా సినిమా కధకు దగ్గరగానే వుంటుంది. అయితే ఈ సినిమాకి ముందే మీ వెబ్ సైట్లలో దీని పేరు కింగ్ అని పోస్ట్ చేయడం దానికి చాలా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది, మాకు కూడా ఇది యాప్ట్ గా అనిపించడం తో దీనిమీదనే జీరో అయిపోయాం.

మీరు వేమన చిత్రం కూడా చేయబోతున్నారు అన్న వార్తలు వచ్చాయి. ఆ ప్రొజెక్ట్ గురించి కొంచెం చెబుతారా?

ఇప్పుడు నా కాంన్సంట్రేషన్ అంతా కింగ్ పైనే. ప్రస్తుతానికి అయితే ఆ ప్రాజెక్ట్ మీద నాకు ఎటువంటి ఇంట్రెస్టూ లేదు, may be in future . . . I dont know.

మీరు అన్ని రకాల సినిమాలూ చేసారు కదా కౌబాయ్ తరహా చిత్రాలు ఎందుకు చేయలేదు, అసలు మీరు ఎటువంటి పాత్రలు ఎక్కువగా చేయడానికి ఇష్టపడతారు?

కౌబాయ్ . . . (నవ్వుతూ) నాకు ఎక్కువగా ఎంటర్ టైన్ మెంట్ చిత్రాలంటే ఇష్టం. అలాగే జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ మూవీస్ అన్నా ఇష్టమే. ఇప్పుడు నేను చేస్తున్న కింగ్ లో ఈ రెండూ వున్నాయి. అలా అని ఇది జేమ్స్ బాండ్ సినిమా మాత్రం కాదు. ఇక కౌబాయ్ టైప్ క్యారెక్టర్ గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు మరి.

ఈ సినిమాకి మళ్ళీ దేవీ మ్యూజిక్ అందిస్తున్నారు . .

అవును నా మన్మధుడు గానీ మాస్ గానీ మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్ అయ్యాయి. శ్రీను కి కూడా రెడీ లో సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు. దేవి అద్బుతమైన కంపోజర్. తను కంపోజ్ చేసిన జల్సా పాటలు నాకు బాగా నచ్చాయి. డెఫినెట్ గా మా ఇద్దరికీ ఇది హ్యాట్రిక్ ఫిల్మ్ అవుతుంది.

ఒక హీరోగా ప్రజల్లో మీకు వుండే గుర్తింపు మీ వ్యక్తిగత జీవితానికి ఏమైనా అడ్డం అవుతుందా . . . ఇన్నేళ్ళ మీ సినీ ప్రస్తానం లో మీ ఫ్రొఫెషన్ మీద చిరాకు పడిన సందర్భాలు ఏమైనా వున్నాయా???

ప్రైవసీ వుండదు అన్న బాధ కొంచం వుంటుంది. కానీ ప్రజల అభిమానం తో పోలిస్తే అది చాలా మైనర్ విషయం. ఇక నా ఫ్రొఫెషన్ మీద చిరాకు పడడం అని కాదు గానీ ఒక్కోసారి మాత్రం బోర్ అనిపిస్తుంది. టైమింగ్ సెట్ కాకుండా సీన్లు తీసినప్పుడూ, నిర్మాతకీ దర్శకుడికీ, నటులకూ మద్య సమన్వయం లోపించినపుడూ . . ఇలాంటప్పుడు కొంచం చిరాకు తో బాటూ బాధ కూడా కలుగుతుంది. కానీ హీరో గా ఇలాంటివన్నిటినీ కూడా ఎదుర్కోక తప్పదు.

ఇన్నేళ్ళు గా సినిమా రంగం లో వున్నారు, ఇప్పుడు మీ అబ్బాయి కూడా హీరో అయిపోతున్నాడు. ఈ టైమ్ లో మీరు సినీరంగానికేం చేయదల్చుకొన్నారు?

ఈ విషయం లో నాకు చాలా చాలా చేయాలని వుంది. ప్రస్తుతం కొన్ని కార్యక్రమాలకు రూపకల్పన కూడా చేయడం జరిగింది. అవి ఏమిటి అనేది మీకు త్వరలోనే తెలియజేస్తాను.

చివరిగా . . చిరంజీవి గారు రాజకీయాలలోనికి వచ్చారు. మరి మీకు రాజకీయంగా ఎటువంటి ఆలోచన వుంది?

ముందుగా చిరంజీవి గారి కి నా అభినందనలు. ఆయన రాజకీయాల్లో కూడా అద్బుతం గా రాణించాలని కోరుకొంటున్నాను. ఇక నా విషయానికి వస్తే . . నా వరకూ ఎందుకు అసలు మా కుటుంబానికే రాజకీయలు పడవు. మరీ ముఖ్యం గా నాకు వాటి మీద ఆసక్తీ లేదు, పరిజ్ఞానం అంతకన్నా లేదు.

మీ కింగ్ ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు?

ప్రస్తుతం పనులు చాలా తొందరగానే నడుస్తున్నాయి. అన్నీ అనుకూలిస్తే డిసెంబర్ పద్దెనిమిదిన రిలీజ్ చేయాలనుకొంటున్నాము. ఎందుకంటే క్రిస్మస్ కి ముందు సంక్రాంతి లోపు ఎంటర్ టైన్ మెంట్ కు సరైన కాలం.

Thank you Nagarjuna gaaru . . Once again we wish you a happy birth day in advance . .

Thanks . . .

Other latest in News
Actor turned Director : G V
Interview with Rajendra Prasad
Interview with Udaykiran
Chat with RGV on his new film and Raksha
Interview with Puri Jagannath
Gopichand
RGV on Raksha
Nikhil talks about Ankit, Pallavi & Friends
Nagarjuna
Interview with JD on Homam
Industry should stand united: Suresh Babu
No exposing; Not for money or career : Ullal
POST YOUR COMMENT

Subject/Headline
Comment
PUBLIC OPINION
Total number of reviews - 2


by anon user on 2008-09-06
Rating:

when the movie king is released.


by anon user on 2008-10-19
Rating:

plz enter u r chaithu after 5 years

SEE ALL REVIEWS >>



Help reading Telugu font? Telugu text is Unicode encoded. If you have any problems viewing the Telugu text in the article, set the character encoding to Unicode in your browser. In Mozilla, this is accessible from View->Character Encoding->Unicode

Syndicate  |   Contact us  |   Disclaimer  |   Feedback
Copyrights © 2002-2006 TOTALTOLLYWOOD.COM. ALL RIGHTS RESERVED.