ఢీ చిత్రం తో మొదలు పెట్టి దుబాయ్ శ్రీను, రెడీ చిత్రాలతో విజయాల హ్యాట్రిక్ ను సాధించిన దర్శకుడు శ్రీను వైట్ల. రెడీ చిత్ర విజయానంతరం ఆయనతో రెడీ గురించి ఆయన తదుపరి చిత్రం అయిన కింగ్ గురించి ఈ రోజు మాట్లాడడం జరిగింది. ఆ సంభాషణ వివారాలు . . .
రెడీ చిత్రం సూపర్ హిట్ అయిన సంధర్భంగా మీకు Congratulations శ్రీను గారూ . . . ఈ విజయం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు . . .
చాలా చాలా సంతోషం గా వుంది, ప్రేక్షకులు నా మీద పెట్టుకొన్న నమ్మకాన్ని నేను నిలబెట్టు కో గలిగాను. అయితే ఇప్పుడు నా మీద భాద్యత కూడా చాలా పెరిగింది. నా తదుపరి చిత్రం మీద కూడా అందరికీ మంచి నమ్మకం వుంటుంది. ఆ విషయం అనుక్షణం నా భాద్యత ను నాకు తెలియజేస్తూ వుంటుంది.
ఢీ చిత్రం వచ్చిన తర్వాత మీ మీద expectations బాగా పెరిగాయి . . .
అవునండీ . . . అందుకే దుబాయి శ్రీను చిత్రం నేను చాలా భయపడుతూనే చేసాను. ఎందుకంటే ఆ చిత్రం మొదలు పెట్టేప్పటికి ఆ టైటిల్ తప్పా నా దగ్గర ఇంకేం లేదు. రవితేజ సంగతి అందరికీ తెలిసిందే కదా, శ్రీనూ మనిద్దరం సినిమా చేస్తున్నాం . . అది కూడా రేపటి నుండే అని నన్ను ఊదర గొట్టేసాడు. ఏదో మొత్తం మీద ఫష్ట్ హాఫ్ బాగానే తీసేసాం . . ఇక సెకండ్ హాఫ్ ఏం చేయాలా అని చాలా స్ట్రగుల్ అయిన తర్వాతనే మిగతా భాగాన్ని పూర్తి చేయడం జరిగింది. సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవ్వడమే కాకుండా రవితేజా కెరీర్ లో నే భారీ ఓపెనింగ్స్ వచ్చిన చిత్రం గా నిలిచింది. అయినా నాలో ఎక్కడో తెలీని వెలితి వుంది. నేను కొంత టైమ్ వుండి వుంటే ఆ చిత్రాన్ని ఇంకా బాగా తీసి వుండేవాడిని కదా, ప్రేక్షకులు నా మీద పెట్టుకొన్న నమ్మకాన్ని నేను పూర్తిగా రీచ్ కాలేక పోయానే అనుకొంటూ, ఈ రెడీ చిత్రానికి ఎక్కడా ఏ లూప్ హోల్సూ లేకుండా అన్ని పూర్తిగా ప్లాన్చేసుకొని షూటింగ్ లోనికి దిగడం జరిగింది, మేం అనుకొన్నట్లే ఇది అందరి అంచనాలనూ నిజం చేస్తూ సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా బొమ్మరిల్లు సృష్టించిన రికార్డులన్నీ బద్దలు కొట్టేదిశగా దూసుకు పోవడం నిజం గా నాకు చాలా ఆనందం గా వుంది.
మీ చిత్రాలన్నీ అబ్బాయి అమ్మాయి ని రక్షించడం అన్న థీమ్ మీదనే వుంటాయి . . . మీ కామెంట్ . . .
నిజానికి కధలు ప్రతీసారీ కొత్తవి పుట్టవండీ, చెప్పే కధ కొత్తది కాకపోయినా చెప్పే విధానం కొత్తగా వుండాలి అంటే కధనం కొత్తగా వుండాలి. ఇక అబ్బాయి అమ్మాయి ని రక్షించడం అన్నది యూనివర్శల్ అప్పీల్ వున్న అంశం. అది యెప్పుడూ కొత్తగానే వుంటుంది. అయినా ఈ ఫార్ములా ఇప్పటిది కాదు, వేటగాడు చిత్రం నుండీ యెన్నో చిత్రాలలో వచ్చింది.
కొంతమంది ఈ చిత్రం దిల్ వాలే దుల్హనియా లేజాయేంగె చిత్రాన్ని పోలి వుంది అంటున్నారు . . .
అలా ఏం లేదండీ . . . నిజానికి రెడీ చిత్రాన్ని నేను చూసినపుడు నాకు మాయా బజార్ గుర్తుకు వచ్చింది. ఇందులో హీరో పెళ్ళి కోసం అతని కుటుంబం మొత్తం వచ్చి ఎన్నో రకాల ప్లాన్ లు వేసి మొత్తానికి అతని పెళ్ళి చేస్తారు. ఇలా మన కధ ల నుండే చాలా సినిమాలు వచ్చాయి, ఇక ఆ కధల జోలి కి వెళ్ళాల్సిన అవసరం యేముంది . . .
శ్రీను వైట్ల చిత్రం అంటే పూర్తి స్తాయి వినోదాత్మక చిత్రం అయి వుంటుంది అన్న నమ్మకం ప్రేక్షకుల్లో వుంది . . . ఒక దర్శకునిగా మీకు ఎటువంటి చిత్రాలు చేయడం అంటే ఇష్టం . . .
ఒక దర్శకుడిగా ప్రేక్షకులకు నచ్చే చిత్రాలు తీయడమే నాకిష్టం. అయితే నేను చిత్ర రంగానికి వచ్చిన కొత్తల్లో నామీద రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం ల ప్రభావం ఎక్కువగానే వుండేది. సీరియస్ ఏక్షన్ చిత్రాలు తీయాలనుకొంటూ వుండేవాడిని. మొన్నీమద్యనే వచ్చిన గ్యాంగ్ స్టర్ చిత్రం చూసినపుడు కూడా ఇలాంటి చిత్రం తీయాలీ అనే అనుకొన్నాను. అయితే ఎప్పటికప్పుడు నా చుట్టూ వుండే గోపీ మోహన్ గానీ, కోన వెంకట్ గానీ లేదు బాబూ నువ్వు తీయాల్సింది ఇది అని మళ్ళీ నన్ను సరైన ట్రాక్ లో పెట్టేస్తూ వుంటారు.
శ్రీను వైట్ల, బ్రమ్మానందం వీళ్ళీద్దరి మద్యా వున్న అవినాభావ సంభందం ఏంటి. . . .
(నవ్వుతూ) అవునండీ శ్రీను వైట్ల చిత్రం అనగానే ఈ సారి బ్రమ్మనందం చేత ఏం చేయించాడో అని చాలామంది చిత్రాన్ని చూడక ముందు అనుకొంటూ వుంటారు. అదేంటో తెలియదు గానీ చాలా చిత్రాల్లొ ఎన్నో సార్లు ఎక్కడో ఏదో కొడుతుంది అనుకొన్న టైమ్ లోనే ఏదో ఒక బ్రమ్మానందం ఎపిసోడ్ లు తట్టడం, అదే ఒక పెద్ద హైలైట్ గా మారిపోవడం జరుగుతుంది.
కానీ మీ గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రం లో బ్రమ్మానందం మీద కామెడీ కొంచం తక్కువగానే ప్లే చేసినట్లు అనిపించింది . . .
నిజం చెప్పాలంటే నా గత చిత్రాలన్నిటికన్నా ఈ రెడీ చిత్రం లోనే బ్రమ్మానందం గారిది చాలా ఇంపార్టెంట్ రోల్. మొత్తం సెకెండ్ హాఫ్ అంతా ఆయన మీదనే రన్ అవుతుంది. ఇక మీరు అన్నట్లు కామెడీ అతని మీద కొంచం తగ్గినట్లు అనిపిస్తుంది, దానికి కారణం ఇందులో చాలా యెక్కువ మంది నటీనటులు వుండడమే, అలాగే అందరూ ఏదో ఒక సంధర్భం లో ప్రేక్షకుడిని నవ్విస్తూనే వుంటారు. అందువల్ల ఆయన కామెడీ తగ్గినట్లు అనిపించ వచ్చు గానీ నిజానికి రెడీ లో కూడా ఆయన నటన అద్బుతం అనే చెప్పాలి.
మీ తదుపరి చిత్రం కింగ్ గురించి చెప్పండి . . .
ఇది డెఫినెట్ గా మంచి చిత్రం అవుతుంది అని మాత్రమే చెప్పగలను, నిన్నటి తో ఒక షెడ్యూల్ పూర్తి అయ్యింది, మళ్ళీ జూలై 14 నుండీ తర్వాతి షెడ్యూల్ మొదలవుతుంది. ఈ చిత్రం లో నాగార్జున గారి క్యారెక్టర్ మునుపెన్నడూ లేని విధం గా వుంటుంది, అలాగే నా మార్క్ కామెడీ టచ్ వుంటుంది. ఈ చిత్రం గురించి ఇంతకన్నా ప్రస్తుతానికి అయితే ఏమీ చెప్పలేను. నవంబర్ కల్లా చిత్రాన్ని పూర్తి చేసి డిశెంబరు 18 న విడుదల చేయబోతున్నాం.
ఈ చిత్రానికి కింగ్ అనే టైటిల్ పెట్టారు కదా, మరి మీ కింగ్ కలెక్షన్ కింగా, ఏక్షన్ కింగా, డైలాగ్ కింగా. . .
(నవ్వుతూ) ప్రస్తుతానికి అయితే టే ’కింగ్’ ఎండ్ మే "కింగ్" మాత్రమే . . . .
పెద్ద హీరోల తో చేస్తున్నప్పుడు వాళ్ళు దర్శకత్వ శాఖ లో కల్పించుకోవడం జరుగుతుందా . . .
నావరకూ నాకు ఎప్పుడూ అలా జరగలేదు మరి . . . రవితేజ గానివ్వండి మరెవ్వరన్నా కానివ్వండి నాకు పూర్తి స్వేఛ్చ ఎప్పుడూ వుంటుంది. ఇప్పుడు నాగర్జున గారి చిత్రం కోసం దాదాపు గా ఆరు నెలలు ముందు గానే ఒక పక్కా కధ ని తయారు చేసుకోవడం అది ఆయనకు చెప్పడం జరిగింది. కధ మొత్తం ఆయనకు పూర్తిగా నచ్చిన తర్వాతనే చిత్రం మొదలు పెట్టాం. నిజం చెప్పాలంటే నాగర్జున గారే డాన్ చిత్రం తర్వాత శ్రీనూ మనం చేద్దాం అని ఆరు నెలలు వెయిట్ చేసారు. సాధారణం గా ఎవ్వరూ దర్శకత్వ శాఖ లో, అదీ కధ పూర్తిగా నచ్చిన తర్వాత వేలు పెట్టడం అన్నది జరగదు.
కింగ్ తర్వాత మీ చిత్రం ఏంటి . . .
వెంకటేష్ గారితో చేస్తున్నాను. అయితే ఎప్పుడు ఏంటి అన్న డీటైల్స్ ప్రస్తుతానికి చెప్పలేను. అయితే దానికి కధ కూడా రడీ అయిపోయింది దానికి కూడా గోపీ మోహనే కధను అందిస్తున్నారు.
ఇప్పుడు శ్రీను వైట్ల అన్న పేరు యు.ఎస్. లో ఒక బ్రాండ్ నేమ్ అయిపోయింది. . . దీనికి ఎలా ఫీల్ అవుతున్నారు . . .
చాలా హ్యాపీ గా వుందండి . . . ఈ నమ్మకాన్ని నేను కూడా ఎప్పుడూ వమ్ము చేయకుండా ప్రతి చిత్రం ఒక చక్కని ఎంటర్ టైనర్ గా మలచడానికే కృషి చేస్తాను . . .
O.K శ్రీను గారూ we wish you all the best for your King and your up coming movies . . .
Thank you verymuch . . .