Actress Tulasi on screen after a long gap
19-Aug-2008
ఆనంద్, హ్యాపీడేస్ చిత్రాలకు శేఖర్ కమ్ముల వద్ద పని చేసిన సాయికిరణ్ ని దర్శకుడి గా పరిచయం చేస్తూ ప్రేమ్ కుమార్ పాట్ర నిర్మిస్తున్న చిత్రం వినాయకుడు. సోనియా, కృష్ణుడు లు జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఆడియో వినాయక చవితి నాడు రిలీజ్ చేయనున్నామని నిర్మాత ప్రేమ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యిందనీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనీ, చిత్రం తీయడానికి ముందు సాయికిరణ్ తనకు ఏదైతే చెప్పాడు అంతకన్న బెటర్ అవుట్ పుట్ ని ఇచ్చాడని కూడా నిర్మాత తెలిపారు. దర్శకుడు సాయికిరణ్ మాట్లాడుతూ కొత్తదనం ఆస్వాదించే వారికి ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుందనీ చిత్రాన్ని తాను అనుకొన్నట్లు గా తీయడానికి నిర్మాత అన్నివిధాలా సహకరించారనీ, నిజానికి ఈ చిత్రం మెఒదట చాలా చిన్న బడ్జెట్ తో చిన్న చిత్రంగానే మొదలైందనీ కానీ ఈ చిత్రానికి వచ్చిన హైప్ వల్ల మద్యలో బడ్జెట్ కొద్దిగా ఓవర్ అయినా నిర్మాత సహకారం తో తాము అనుకొన్నట్లు గానే చిత్రాన్ని కంప్లీట్ చేసామని తెలిపారు. అలాగే తమ చిత్రం లో సినిమాటోగ్రఫీ (పి జి విందా) సంగీతం (శ్యామ్ ప్రసన్న) లు హైలైట్స్ గా నిలుస్తాయని కూడా ఆయన తెలిపారు. శంకరాభరణం తో సినీ కెరీర్ ని ప్రారంభించిన తులసి చాలా కాలం తర్వాత మళ్ళీ తమ చిత్రం లో నటించడం తమకు చాలా ఆనందంగా వుందని దర్శకనిర్మాతలు తెలియజేసారు.
|