All Roads lead to Tirupathi
26-Aug-2008
మరి కొద్ది గంటల్లో ఒక మహా ప్రభంజనానికి తెర లేవనుంది. అన్ని రోడ్లూ తిరుపతికే అన్నట్లు గా రాష్ట్రం మొత్తం తిరుపతికే బయలుదేరిందా అన్నట్లు గా వుంది. తిరుపతి ఎప్పుడూ జనప్రవాహం తో కిటకిటలాడుతూనే వుంటుంది. అయితే ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతుంది అని చెప్పాలి. దాదాపు గా పదిహేను లక్షలమంది పై చిలుకు అభిమానులు తమ అన్నయ్య మాటలు వినడం కోసం ఆ మహా ప్రాంగణం లో బారులు తీరి వున్నారు. తిరుపతి కి సమీపం లోని అవిలాల మైదానం లో జరిగే ఈ మహా సభా వేదికకు ఈ రోజు ఉదయం నుండే చాలామంది చేరుకొన్నారు. ఈ మైదానం లో డబ్బై అడుగుల పొడవు నలభై అడుగుల వెడల్పు భారీ వేదిక, వేదిక మీద రెండు భారీ డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేయబడ్డాయి. సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలకు సభ మొదలవుతుందని చెబుతున్నారు. వేదిక చుట్టూ చాలా హై సెక్యూరిటీనీ చాలా బలమైన బ్యారికేడ్లనూ ఏర్పాటు చేసారు. మూడువేలమంది పోలీసులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రజల అవసరార్ధం దాదాపు ఇరవైఅయిదు లక్షల వాటర్ ప్యాకెట్స్ ని తెప్పించి వుంచడం జరిగింది. ఒక వేళ ఏదైనా తొక్కిసలాట జరిగితే ఆదుకొనేందుకు సిద్దంగా ఎనిమిది అంబులెన్సులు కూడా సిద్దం చేయబడ్డాయి. రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుండి డైరెక్ట్ గా వేదకకు ఒక ప్రత్యేక వాహనం లో చిరంజీవి చేరాల్సి వుంది. ఒకవేళ ఏదైనా ట్రాఫిక్ జాం సంభవిస్తే చిరంజీవి ని వేదిక వద్దకు చేర్చడానికి ఒక హెలీకాప్టర్ ను కూడా సిద్దం చేసారు. మీడియా మొత్తం ఇప్పుడు వేదిక వద్దనే పలువురు నాయకుల అభిప్రాయాలను సేకరించడం లో తలమునకలై వుంది. మార్పు కోసమే నేను రాజకీయాల్లానికి వస్తున్నాను అంటున్న చిరంజీవి తన పార్టీ పేరు నూ, గుర్తునూ ఎజెండానూ వేదిక మీదనుండే ప్రకటించనున్నారు. అలాగే పలుపార్టీలనుండి తనవద్దకు వచ్చిన పలువురు సీనియర్ నాయకులకు పార్టీ సభ్యత్వం కూడా వేదికమీదనే ఇవ్వడానికి రంగం సిద్దమయ్యింది. అలాగే తన పార్టీ విధి విధానలనూ హై ఫై లెవెల్ లో ఒక పవర్ పాయింట్ ప్రొజెక్షన్ ద్వారా వెల్లడి చేయనున్నారు. పలువురు సినీరంగ ప్రముఖులు కూడా ఈ సభకు హాజరవ్వనున్నారు. బ్రమ్మానందం, శ్రీకాంత్, రవితేజ, వి.వి.వినాయక్, పూరిజగన్నాధ్ లకు గానీ వారి కుటుంబ సబ్యులలో ఒకరికి గానీ పార్టీ టికెట్ లు ఇవ్వనున్నట్లు గా తెలిసింది. ఉదయించే సూర్యుడు ని తమ పార్టీ గుర్తుగానూ ప్రజా రాజ్యం అనే పేరు ను తమ పార్టీ పేరుగానూ చిరంజీవి ప్రకటించనున్నారని కొన్ని వార్తలు టి.వి. మీడియాలో వచ్చాయి. అయితే అవి నిజమా కాదా అన్నది మరి కొద్ది సేపటిలో తెలియనున్నది.
|
Help reading Telugu font? Telugu text is Unicode encoded. If you have any problems viewing the Telugu text in the article, set the character encoding to Unicode in your browser. In Mozilla, this is accessible from View->Character Encoding->Unicode
|