Audio of Yuvata released
21-Aug-2008
"యువత" ఈ పేరు కి తగినట్లు గానే ఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో గల జౌక్ పబ్ లో ఒక యూత్ ఫుల్ ఎట్మాస్పియర్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. వర్త్ వాచింగ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై పరశురాం (బుజ్జి) ని దర్శకుడి గా పరిచయం చేస్తూ హరి, ఉమా ప్రకాష్ లు నిర్మిస్తున్న ఈ చిత్రం లో నిఖిల్, అక్ష లు జంటగా నటించారు. మణిశర్మ అందించిన బాణీలతో ముస్తాబైన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా దిల్ రాజు, బొమ్మరిల్లు భాస్కర్ లు హాజరయ్యారు. భాస్కర్ తొలి కేసెట్ ని ఆవిష్కరించి దర్శకుడు పరశురాం కి అందజేయగా, తొలి సిడి ని దిల్ రాజు ఆవిష్కరించి నిర్మాతల్లో ఒకరైన హరి కి అందజేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ చిత్రం లో హీరో గా చేసిన నిఖిల్ హ్యాపీడేస్ లో చేయకముందు చాలా సార్లు మా ఆఫీస్ కి వచ్చి క్యారెక్టర్ రోల్స్ కోసం అడుగుతూ వుండేవాడు. అయితే ఒక రోజు సడన్ గా హ్యాపీడేస్ టీం లో కనబడేసరికి నేను చాలా థ్రిల్ అయ్యాను. ఆ సినిమా షూటింగ్ టైమ్ లోనే నిఖిల్ కి మంచి భవిష్యత్ వుందని అతనికి చెప్పాను. ఇప్పుడు యువతకి ఇతనొక క్రేజీ హీరో గా మారడం నాకు చాలా ఆనందం గా వుంది, అలాగే పరశురాం చాలా మంచి వ్యక్తి, పరుగు చిత్రం కి తను పనిచేస్తూనే ఈ సినిమా మొదలు పెట్టాడు. మా సినిమాలు కొన్ని చాలా మంచి డైలాగ్ లు అతని దగ్గరనుండి వచ్చినవే, డెఫినెట్ గా అతను కమింగ్ ఫ్యూచర్ లో పెద్ద డైరెక్టర్ అవుతాడు అనడం లో సందేహం లేదు. చూడడానికి చిన్న చిత్రం లా అనిపించినా మణిశర్మ అందించిన సంగీతం దీనికి చాలా రిచ్ లుక్ ఇచ్చింది. ఇలా అన్నీ అద్భుతం గా అమరాయి కాబట్టి డెఫినెట్ గా యువత పెద్ద విజయాన్ని సాధిస్తుంది అని అన్నారు.
భాస్కర్ మాట్లాడుతూ పరశురాం ఒక పని రాక్షసుడనీ తాను అనుకొన్నది వచ్చేవరకూ నిద్రపోడనీ, తన దగ్గర పనిచేసేటప్పుడు అతనిలో వున్న ఆ ఫైర్ తనను ఆకట్టుకొందనీ, ఇక ఈ యువత పాటలు వింటుంటేనే సినిమా సక్సస్ అనిపిస్తుందనీ అన్నారు. దర్శకుడు పరశురాం మాట్లాడుతూ తాను ఈ రోజు ఈ స్ధితిలో వుండడానికి కారణమైన అందరికీ తన ధన్యవాదాలనీ, పూరి జగన్నాధ్, దిల్ రాజు గార్లు తనకు ఆదర్శమనీ తన కెరీర్ మొదటి నుండీ వారితోనే వున్నానని, ఇక తనకు తొలి అవకాశాన్ని కేవలం కధను విని వీడు తీయగలడు అన్న నమ్మకం తో ఇచ్చిన నిర్మాతలకు తన ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నానీ అలాగే అద్బుతమైన సంగీతాన్ని అందించిన మణిశర్మ గారి ని ఎప్పటికీ మరిచిపోలేననీ ఒక విజయవంతమైన చిత్రం తీయడానికి తాను చాలా కష్టపడ్డాననీ, ప్రేక్షకులకి ఒక చక్కని ఎంటర్టైనర్ అందించాననుకొంటున్నాని ఇక ఆశీర్వదించాల్సింది ప్రేక్షకులే అని అన్నారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ ఈ చిత్రం లో తనది ఫుల్ జోష్ వున్న పాత్ర అనీ డెఫినెట్ గా అందరికీ నచ్చుతుందనీ అన్నారు. హీరోయిన్ అక్ష మాట్లాడుతూ తనకు ఇదే తొలి చిత్రం అనీ మణిశర్మ గారి మ్యూజిక్ సూపర్ గా వుందనీ మా టీమ్ మొత్తం యంగ్ టీమ్ అనీ సినిమా కూడా అలానే వుంటుందనీ అన్నారు.
Yuvata - Nikhil Aksha - Worth Watching Ent - Movie Stills, Yuvata - Nikhil, Aksha - Wallpapers,
|