Login Password Register? Forgot passwd?
    Home  |  News  |  Gallery  |  Interviews  |  Reviews  |  Wallpapers  |  Music  |  Videos  |  Showtimes  |  Movies  |  Profiles                    19 Nov 2008
Telugu Films News Categories:
Press Meets | Music Release Event | Movie Launch Event | Success Events | Latest News | Special Events | Gossips | Other Languages | Synopsis | Box Office | Preview |

You are here: TotalTollywood >> News >> Press Meets
Baladitya dialogs, songs for Meow
14-Sep-2008

Baladitya dialogs, songs for Meow
ఏక రుద్రా దేవి ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకం పై అంతా కొత్తవాళ్ళతో "మ్యావ్" అనే చిత్రాన్ని విద్య దర్శకత్వం లో చెన్నుపాటి నాగ మల్లేశ్వరి నిర్మించారు. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ ఈ రోజు వుదయం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా గుండె జల్లుమంది దర్శకుడు మదన్ హాజరయ్యారు. ఈ చిత్రం లో నటించిన నటులందరూ కూడా మాస్క్ లు ధరించి వేదిక మీదకు హాజరయ్యారు. సినిమా రిలీజ్ వరకూ వీరిని మాస్క్ లలోనే వుంచ దలచుకొన్నామని సినిమాను ఒక కొత్త తరహా లో చేసామనీ అందుకే పబ్లిసిటీ లో కూడా ఒక కొత్తదనాన్ని చూపాలని ఇలా చేస్తున్నామని దర్శకుడు విద్య తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందించిన సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ ఇది సాంకేతిక నిపుణులందరూ కలిసి చేస్తున్న చిత్రం అనీ, చిత్రం మొత్తం ఆరుగురి మద్యనే జరుగుతుందనీ, బ్యాంకాక్ లోని పలు సుందరమైన లొకేషన్స్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించామని తెలిపారు. అనంతరం మదన్ లోగో ను ఆవిష్కరించి దర్శకుడు విద్య తనకు ఆనలుగురు చిత్రం నుండీ తెలుసనీ, తన పెళ్ళైన కొత్తలో చిత్రం లోని చెలివో నా చిలిపి కలవో పాటకూ, గుండెజల్లుమందిలో మూడు పాటలకూ కొరియోగ్రాఫర్ గా పనిచేసాడనీ ఎప్పుడూ తనతోనే వుండే వీళ్ళు ఈ సినిమాను ఎప్పుడు తీసేసారో తనకు అర్ధం కాలేదనీ, ఏమైనా ఒక కొత్తదనం మాత్రం ఈ చిత్రం లో వుంటుందని నమ్ముతున్నాననీ వీరి మొదటి ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకొంటున్నాననీ అన్నారు. ఈ చిత్రం లో నటిస్తున్న భూషణ్, గాయత్రి, శ్రీని, వకార్, గణేష్, రచన, వెంకట్ లు ఈ చిత్రం తమకు డెఫినెట్ గా ఒక మంచి గుర్తింపును తెస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. ఈ చిత్రానికి మాటలు పాటలు అందించిన నటుడు బాలాదిత్య మాట్లాడుతూ తానేదో హాబీగా అప్పుడప్పుడూ పాటలు రాసుకొంటూ వుంటాననీ అలాంటి తనను ఒక రోజు సడన్ గా విద్య తన చిత్రానికి మాటలు రాయమని అడిగినప్పుడు నావల్ల కాదు అని చెప్పాననీ కానీ ఆయన కధ చెప్పినతర్వాత సరే ప్రయత్నిద్దాం అనుకొని మొదలు పెట్టాననీ ఇప్పుడు సినిమా అయిపోయినతర్వాత చూస్తే నేనే రాసానా అన్న ఆశ్చర్యం కలుగుతుందనీ డెఫినెట్ గా ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందని అన్నారు.
Other latest in News
Ravi Yadav's Maro Charitra in US (03/11/08)
Youvatha is all set to release (26/10/08)
We celebrate Deepavali from 31st of this month : Venu (26/10/08)
Sai will become another a r rehman : Sri Hari (26/10/08)
Surya S/o Krishnan is all set to release (26/10/08)
Audio of Happy journey released (26/10/08)
Ch Ravi unit celebrates Platinum Disc function (26/10/08)
ARTISTS WANTED FOR KANNAN'S FILM SARAI VEERRAJU (24/10/08)
Its not Puli but Komaram Puli?? (23/10/08)
POST YOUR COMMENT

Subject/Headline
Comment
PUBLIC OPINION
No comments posted so far



Help reading Telugu font? Telugu text is Unicode encoded. If you have any problems viewing the Telugu text in the article, set the character encoding to Unicode in your browser. In Mozilla, this is accessible from View->Character Encoding->Unicode

Syndicate  |   Contact us  |   Disclaimer  |   Feedback
Copyrights © 2002-2006 TOTALTOLLYWOOD.COM. ALL RIGHTS RESERVED.