Chintakayala Ravi album is best of my career
20-Sep-2008
చింతకాయల రవి చిత్రం ఆడియో ఘన విజయాన్ని సాదించిన సందర్భంగా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో ఈ రోజు ఈ చిత్రం యూనిట్ పాత్రికేయులను కలిసింది. రామానాయుడు స్టూడియోస్ లో ప్రత్యేకం గా వేసిన సెట్ లో ఈ చిత్రానికి సంబందించిన ఒక డ్యూయెట్ ను వెంకటేష్, మమతా మోహన్ దాస్ ల పై చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు కళ్యాణ్ మాస్టర్ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ చిత్రం ఆడియో తన చిత్రాలన్నిటిలోకీ ది బెస్ట్ ఆడియో అని వెంకటేష్ అన్నారు. విశాల్ శేఖర్ లు అందించిన అద్భుతమైన ట్యూన్ లకు చంద్రబోస్ అంతే అద్బుతమైన సాహిత్యాన్ని సమకూర్చారనీ, తన ఫాన్స్ గానీ జనరల్ ప్రేక్షకులు గానీ అందరూ ఈ రోజు ఈ ఆడియోను ఇష్టపడుతున్నారని కూడా ఆయన అన్నారు. తనకు సహజం గా మెలొడీలే బాగా నచ్చుతాయనీ ఈ చిత్రం లో ప్రేమించా, బావుందే బావుందే పాటలు తనకు బాగా ఇష్టమనీ అయితే ఫాస్ట్ బీట్ సాంగ్ అయిన నహీ చోడూంగా కూడా తనకు బాగా నచ్చిందని కూడా వెంకటేష్ తెలిపారు. సురేష్ బాబు మాట్లాడుతూ బుజ్జి కి తన ప్రతి సినిమాలోని ఆఖరు పాటను ఇక్కడ వేసిన సెట్ లో తీయడం సెంటిమెంట్ అనీ, అలా చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ లనీ ఈ చిత్రం కూడా అదే రేంజ్ లో వుంటుందని అన్నారు. చిత్ర దర్శకుడు యోగేష్, హీరోయిన్లు మమత, అనూష్క లు ఆడియో ను ఆదరించిన ప్రేక్షకులకు తమ దన్యవాదాలు తెలిపారు. అక్టోబర్ ఒకటి న ఈ చిత్రం రిలీజ్ కానుందని నిర్మాత నల్లమలుపు బుజ్జి తెలిపారు.
Chintakayala Ravi - Venkatesh - Movie Stills, Ch.Ravi Audio - Events, Ch Ravi Working stills - Events, Ch Ravi Pressmeet - Events, Anushka @ Ch Ravi - Exclusive, Mamatha @ Ch Ravi - Exclusive, Venkatesh @ Ch Ravi - Exclusive,
|
|