Dasari as Shipyard Mestri in Mestri
26-Aug-2008
దాసరి నారాయణ రావు చాలాకాలం తర్వాత నటుడి గా చేస్తున్న చిత్రం మేస్త్రి. సురేష్ కృష్ణ దర్శకత్వం లో నిర్మితమవుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ఫిలింసిటీ లో మొదలయ్యింది. ఈ బుధవారం నుండీ రెగ్యులర్ షూటింగ్ కొనసాగనున్నది. శ్రీహరి, ఆకాశ్, కమలిని ముఖర్జి, మీరాజాస్మిన్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం లో దాసరి నారాయణరావు షిప్ యార్డ్ మేస్త్రీ గా నటిస్తున్నారు. కొన్ని కొన్ని సమస్యలనుండి తన కుటుంబాన్ని ఎలా రక్షించుకొన్నాడూ, అదే సమయం లో సమాజానికి ఎటువంటి మంచి చేసాడు అన్నదే ఈ చిత్ర కధాంశం అని దర్శకుడు తెలిపారు. దాసరి నారాయణరావు తన స్వంత బ్యానర్ లోనే నిర్మిస్తున్న ఈ చిత్రానికి టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గరనుండీ చక్కని రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు దాసరి నారాయణరావు చాలా చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న చిత్రం కావడం కూడా ఈ క్రేజ్ కి కారణమని చెప్పాలి.
|