Eela title for Ajay's debut as hero
24-Aug-2008
ఆనలుగురు రచయితా, పెళ్ళిఅయిన కొత్తలో దర్శకుడు అయిన మదన్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం గుండె జల్లుమంది. ఇటీవలే కీరవాణి అందించిన ఈ చిత్రం ఆడియో రిలీజ్ కావడం మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. ఉదయ్ కిరణ్ హీరో గా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. ఈ చిత్రం తర్వాత మదన్ పలు చిత్రాల్లో సహాయ పాత్రల్లోనూ, విలన్ గానూ నటించి మంచి నటుడి గా పేరొందిన అజయ్ ని హీరో గా పరిచయం చేస్తూ "అట్నుంచి నరుక్కురా" అనే ఒక చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం టైటిల్ ని ఇప్పుడు "ఈల" గా మార్చారని తెలిసింది. ఈ చిత్రం కోసం అజయ్ ఒక ఆల్ న్యూ గెటప్ లో కనిపించనున్నాడు. గుండెజల్లుమంది చిత్రం రిలీజ్ తర్వాత ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళనున్నది.
|