Ekaloveudu is all set to hit the screens in october
29-Sep-2008
గతం లో నరసింహనాయుడు లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన మేడికొండ మురళీ కృష్ణ సమర్పణ లో నూతన దర్శకుడు కె.ఆర్.కె. దర్శకత్వం లో అమర్ చంద్ నిర్మిస్తున్న చిత్రం "ఏకలవ్ యు డు". శ్రీ వెంకటరమణ ఫిల్మ్స్ బ్యానర్ పై పదవ చిత్రం గా వస్తున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ మొత్తాని పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వుంది. అనీల్ కృష్ణ అందించిన సంగీతం ఇటీవలే సుప్రీమ్ మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది. ఆడియో సక్సస్ అయిన సందర్భంగా ఈ చిత్ర హీరో ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ ఈసినిమాకి కేవలం కధే హీరో అనీ, ఒక కమర్షియల్ చిత్రం లో వుండాల్సిన అన్ని అంశాలూ ఈ చిత్రం లో వున్నాయనీ, అలాగే పాటలు కూడా చాలా సంధర్భోచితం గా వస్తాయనీ, పాటలు కూడా సినిమాలో ఒక భాగం గా వుంటాయనీ, ఇటువంటి అంశాలన్ని దర్శకుడు కె ఆర్ కె చాలా కేర్ తీసుకొని చేసాడనీ అన్నారు. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమలో పడడం అన్నదే కాకుండా ఒకరికి మనసివ్వడం కంటే వారి కోసం చావడానికైనా సిద్దం గా వుండగలరా ప్రేమికులు అన్న పాయింట్ ని ఆధారం గా చేసుకొని ఈ చిత్రాన్ని చేసామనీ, నిజానికి ఇంత చక్కని పాయింట్ ని తీసుకొని ఈ చిత్రం చేస్తున్న నిర్మాతను అభినందించాలని కూడా ఉదయ్ కిరణ్ అన్నారు. మురళీ కృష్ణ మాట్లాడుతూ ఈ ఆడియో డెఫినెట్ గా సక్సస్ అవుతుంది అని మేము అనిల్ ని సంగీత దర్శకుడి గా తీసుకొన్నప్పుడే అనుకొన్నాం. ఎందుకంటే తన ట్యూన్స్ ని విన్నప్పుడు మణిశర్మ మ్యూజిక్ లో వుండే బీట్, కీరవాణి మ్యూజిక్ లో వుండే మెలోడీ రెండూ కనబడ్డాయి. డెఫినెట్ గా సమీప భవిష్యత్ లో అనీల్ కృష్ణ మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు అని అన్నారు. ప్రస్తుతం చివరిదశ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వున్న ఈ చిత్రం మొదటి కాపీ రెండుమూడు రోజుల్లో రానుంది. త్వరలోనే సెన్సార్ కూడా పూర్తి చేసి దశరా నవ రాత్రుల్లో ఒక రోజు చిత్రాన్ని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
|