GV has potential of mass director: Naga Babu
01-Sep-2008
మన్యం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై మన్యం రమేష్, విలన్ గా క్యారెక్టర్ నటుడి గా సుపరిచితుడైన జీవి ని దర్శకుడి గా పరిచయం చేస్తూ ఒక చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నితిన్, భావన లు ఈ చిత్రం లో జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి హీరో అన్న టైటిల్ ని కన్ఫర్మ్ చేసిన సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో టైటిల్ లోగో ను ఆవిష్కరించారు. బావగారూ బాగున్నారా చిత్రం నుండీ నాగేంద్రబాబు గారు నిర్మించిన అన్ని చిత్రాలకూ తాను పనిచేసాననీ, ఆయన సహాయంతోనే తాను గతం లో తీసిన ముని చిత్రాన్ని సక్సస్ చేయగలిగాననీ నిర్మాత మన్యం రమేష్ అన్నారు. కధ గురించి చెబుతూ హీరో హీరోయిన్లు ఇద్దరికీ సమాన ప్రాధాన్యత వున్న చిత్రం అని నాగేంద్రబాబు, రమ్యకృష్ణలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని కూడా ఆయన తెలిపారు. హీరో నితిన్ మాట్లాడుతూ ఈ చిత్రం తనకు సై చిత్రాన్ని గుర్తుకు తెస్తుందనీ, దర్శకుడు జీవి దీనిని మరింత స్టైలిష్ గా రూపొందించారని అన్నారు. పాత్రపరం గా ఇందులో తన హెయిర్ స్టైల్, మేనరిజమ్స్ చాలా డిఫరెంట్ గా వుంటాయని కూడా ఆయన తెలిపారు. సినిమా అంతా బాలీ వుడ్ స్టైల్ లో వుంటుందనీ, రెండుపాటలు, క్లైమాక్స్ లు ప్రస్తుతం షూట్ చేయాలనీ ఈ నెల పన్నెండు నుండీ స్విట్జర్లాండ్ లో పాటలు షూట్ చేసి చిత్రాన్ని అక్టొబర్ లో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకొంటున్నామని కూడా ఆయన తెలిపారు. దర్శకుడు జీవి మాట్లాడుతూ తాను ఇంతవరకూ దాదాపు నూట యాభై చిత్రాల్లో నటించాననీ, నటుడి గా నాలో పేరుకుపోయిన ఏదో ఒక వెలితి ఇప్పుడు తొలగిపోయిందనీ నటుడు జీవి అన్నారు. ఈ చిత్రం లో ముఖ్య పాత్ర పోషించిన నాగేంద్ర బాబు మాట్లాడుతూ జీవి లో ఇంత టాలెంట్ ఉందని తాను ఎప్పుడూ అనుకోలెదని, డెఫినెట్ గా అతను ఒక పెద్ద మాస్ డైరెక్టర్ అవుతాడని అన్నారు. ఈ చిత్రం లో ఇంకా కోవై సరళ, బ్రమ్మానందం,తనూరాయ్, కోట, బాబూ మోహన్ తదితరులు నటించారు.
Hero - Movie Stills, Hero (working stills) - Exclusive,
|