Hari Prasad is no more . . .
18-Aug-2008
దాదాపు గా వంద చిత్రాలలో నటించి, తెలుగు కన్నడ భాషల్లో పలు చిత్రాలను నిర్మించిన ప్రముఖ నటుడు, నిర్మాత అన్నిటికన్నా మెగాస్టార్ చిరకాల మిత్రుడు అయిన హరి ప్రసాద్ గుండెపోటు తో మరణించారు. నిన్న మద్యాహ్నం చిరంజీవి గారు తన రాజకీయరంగప్రవేశం గురించి అనౌన్స్ చేసినప్పటినుండీ చాలా ఉత్సాహంగానూ, సంతోషంగానూ తోటి మిత్రులతో గడిపిన హరిప్రసాద్ ఒక ఛానల్ వారు చిరు రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడడానికి ఆహ్వానించగానే తాను వస్తున్నా అని చెప్పి నిన్న సాయంత్రం దాదాపు ఏడుగంటలకు సదరు ఛానల్ ఆఫీస్ కు వెళ్ళడం చిరు పార్టీకి మద్దతుగా వారితో మాట్లాడడం జరిగింది. ఆ కార్యక్రమం కొంత సేపటిలో ముగుస్తుంది అనగా ఆయనకు గుండెపోటు సంభవించింది. ఛానల్ యాజమాన్యం వెంటనే తేరుకొని హుటాహుటిన హాస్పటల్ కి తరలించినా ఫలితం లేకపోయింది. హాస్పటలో ఆయన తుది శ్వాస విడిచారు. నిజానికి శ్రీ హరి ప్రసాద్ తాను కూడా చిరు రాజకీయపార్టీ మొదలైన తరువాత చాలా యాక్టివ్ గా అన్ని కార్యక్రమాలలోనూ పాల్గొనాలనీ, తనకున్న ఓవర్ వెయిట్ అందుకు ప్రతిబంధకమ్ గా వుంటుందని భావించి గత వారం రోజులు గా నేచర్ క్యూర్ ని పాటిస్తూ సరి అయిన డైట్ కూడా తీసుకోకపోవడం వల్ల కూడా ఇది సంభవించి వుండవచ్చు అని వైద్యులు తెలిపారు.
హరిప్రసాద్ భౌతిక కాయాన్ని ఈ రోజు సాయంత్రం వరకూ సందర్శనార్ధం ఫిల్మ్ చాంబర్ వద్ద వుంచి, సాయంత్రం ఎస్ ఆర్ నగర్ వద్ద అంత్యక్రియలు నిర్వహిస్తారు. హరిప్రసాద్ తనకు చాలా దగ్గరి మిత్రుడని, ఒకే రూమ్ లో తామందరం ఎటువంటి అరమరికలూ లేకుండా వుండేవారమనీ, అతను లేని లోటు తీర్చలేనిదనీ, ఆయన కుటుంభ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాననీ, అలాగే వారికి అన్ని విధాలా తాను సహాయపడతానని చిరంజీవి అన్నారు. ఈ రోజు వుదయం నుండీ పలువురు చలన చిత్ర ప్రముఖులు హరిప్రసాద్ పార్దీవ శరీరాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు.
|