I felt am new to camera : AVS
18-Sep-2008
ఇటీవలే తీవ్ర అనారొగ్యానికి గురై ఇప్పుడు కోలుకొని మళ్ళీ కెమెరాముందుకు వచ్చారు నటుడు ఎ వి ఎస్. కల్పనా ఆర్ట్స్ చిత్రం అ ఆ ఇ ఈ షూటింగ్ లో ఈ రోజు ఎ వి ఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ చిత్రం యూనిట్ వారు ఆయనకు అభినందనలు తెలుపుతూ ఒక ప్రెస్ మీట్ ని ఎరేంజ్ చేసారు. ఈ మీట్ లో నటులు సునీల్, వుత్తేజ్, రమ్యశ్రీ, దర్శకుడు శ్రీనివాస రెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా నటుడు వుత్తేజ్ మాట్లాడుతూ ఎ వి ఎస్ గారు తనకు గురుతుల్యులనీ ఎంతో పెద్ద ప్రమాదం నుండి క్షేమంగా బయటపడి మళ్ళీ ఇలా అందరిముందుకూ రావడం నిజం గా చాలా సంతోషకరమైన విషయం అనీ, ఆయన సెకెండ్ ఇన్నింగ్స్ అ ఆ ఇ ఈ తో మొదలై వర్ణమాల మొత్తం వుండాలనీ ఆయన నిండునూరేళ్ళూ ఇలా సంతోషం గా వుండాలనీ అన్నారు. నటుడు సునీల్ మాట్లాడుతూ ఒక క్లిష్ట పరిస్తితి నుండి బయటపడి మళ్ళీ ఇలా రావాలంటే దానికి ఎంతో మనోబలం కావాలనీ అది ఎ వి ఎస్ గారి వద్ద పుష్కలంగా వుందనీ ఇది ఎలాంటిదంటే ఇప్పుడు బ్యాట్స్ మెన్ షాట్ కొట్టినపుడు అది గాల్లోనికి లేస్తుంది, దాన్ని క్యాచ్ పట్టేస్తారూ పట్టేస్తారూ అనుకొంటూ వుంటే అది మిస్ అయిపోతుంది, ఇక సచిన్ టెండూల్కర్ వంటి వారు ఆ తర్వాత వందల కొద్దీ రన్స్ చేసేస్తూ వుంటారు, ఎ వి ఎస్ గారూ కూడా అంతే అన్నారు. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఎ వి ఎస్ గారు దాదాపు తాను చేసిన అన్ని చిత్రాలలోనూ వున్నారనీ ఆయనతో షూటింగ్ చేయడం తనకు చాలా ఇష్టమనీ ఆయన చిరకాలం ఇలా నవ్వుతూ ప్రజలను నవ్విస్తూ వుండాలని తాను కోరుకొంటున్నాననీ అన్నారు. చివరగా ఎ వి ఎస్ మాట్లాడుతూ వీరి అభిమానానికి తాను సర్వదా కృతజ్ఞుడననీ తాను అనారోగ్యానికి గురికాక ముందు చివరగా చేసిన సినిమా కూడా శ్రీనివాస రెడ్డిదే అనీ అది కూడా ఇదే లొకేషన్లో చేసాననీ మళ్ళీ తన పునరాగమనం కూడా ఇక్కడే మొదలవడం నిజం గా చాలా ఆనందంగా వుందనీ, తాను బాధల్లో వున్నన్నాళ్ళూ తన సహ నటీనటులందరూ తనకు ఎంతగానో అండగా నిలిచారనీ వారందరికీ తాన ధన్యవాదాలని అన్నారు.
|