KSR is a complete family entertainer: Ramanaidu
18-Sep-2008
శ్రీకాంత్, శివాజి, ఛార్మి, గౌరీ ముంజల్ లు జంట గా సూర్యప్రసాద్ దర్శకత్వం లో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి.రామానాయుడు నిర్మిస్తున్న చిత్రం కౌసల్యా సుప్రజా రామా. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం రామానాయుడు స్టూడియో లో ఘనం గా జరిగింది. ముఖ్య అతిధి హీరో వెంకటేష్ తొలి సి.డి ని రిలీజ్ చేసి శ్రీకాంత్ కు అందజేయగా సురేష్ బాబు తనయుడు అభిరాం తొలి కేసెట్ ని విడుదల చేసి హీరోయిన్ ఛార్మి కి అందజేసారు. ఈ కార్యక్రమం లో పరచూరి వెంకటేశ్వర రావు, బ్రమ్మానందం, కోట, చలపతి రావు, హేమ, శివాజి, శివారెడ్డి, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రేమ్ నగర్ సినిమా తీస్తున్నప్పుడు ఎంత టెన్షన్ పడ్డానో ఈ సినిమాకి కూడా అంతే తపన పడ్డాను అప్పుడు అది హిట్ అయ్యింది, ఇప్పుడు ఇది హిట్ అవుతుందన్న నమ్మకం వుందని నిర్మాత రామానాయుడు అన్నారు. బ్రమ్మానందం మాట్లాడుతూ ఈ చిత్రం లో తనదో గమ్మత్తైన పాత్ర అనీ తానొక కార్మిక, శ్రామిక దొంగననీ ఇక వాడు ఎంత కష్టపడతాడు తెరమీద చూడాల్సిందే ననీ డెఫినెట్ గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అన్నారు. హీరో వెంకటేష్, శ్రీకాంత్, చార్మి తదితరులు కూడా ఈ సినిమా విజయాన్ని కాంక్షిస్తూ మాట్లాడారు. ఈ చిత్రం ఆడియో కూడా ఆదిత్య మ్యూజిక్ ద్వారానే విడుదల అయ్యింది.
Kausalya Supraja Rama - Movie Stills, Kowsalya Supraja Rama Audio - Events,
|