Kausalya Supraja Rama release on 9th Oct
29-Sep-2008
శ్రీకాంత్, ఛార్మి లు జంటగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూర్య తేజ దర్శకత్వం లో రామానాయుడు నిర్మిస్తున్న "కౌసల్యా సుప్రజా రామ" చిత్రం అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని దశరా సందర్భంగా అక్టొబర్ తొమ్మిది న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రామానాయుడు మాట్లాడుతూ "ఇటీవలే విడుదల అయిన మా సినిమా మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కోటి చాలా చక్కని సంగీతాన్ని అందించాడు. డెఫినెట్ గా మ్యూజిక్ మా చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక శ్రీకాంత్ మా బ్యానర్ లో చేసిన సినిమాలన్నీ పెద్ద విజయాలు సాధించాయి. ఈ సినిమా కూడా వాటిలో ఒకటి అవుతుంది అన్న నమ్మకం నాకుంది. దర్శకుడు సూర్యతేజ ఈ చిత్రం తర్వాత డెఫినెట్ గా బిజీ డైరెక్టర్ అవుతాడు. ఆరోగ్యకరమైన కామెడీతో ఇంటిల్లిపాదీ కలిసి చూడదగిన చిత్రం గా మా కౌసల్య సుప్రజా రామ వుంటుంది" అని అన్నారు
Kausalya Supraja Rama - Movie Stills, Kowsalya Supraja Rama Audio - Events,
|
|