Kona Venkat's Nenu Thanu Aame audio on 27th
20-Aug-2008
ప్రముఖ రచయిత కోన వెంకట్ తొలి సారిగా దర్శకత్వం వహించిన చిత్రం "నేను తను ఆమె". స్మార్ట్ పిక్చర్స్ బ్యానర్ పై గౌరవ్ శర్మ నిర్మిస్తున్న ఈ చిత్రం లో మాధవన్, సదా, షమితా శెట్టి లు ప్రధాన పాత్ర లు పోషించారు. మాధవన్ కు ఇది తొలి తెలుగు స్ట్రైట్ చిత్రం కావడం విశేషం. అలాగే శిల్పా శెట్టి సోదరి అయిన షమిత కు కూడా తెలుగులో ఇదే మొదటి చిత్రం. ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ గా రూపొందిన ఈ చిత్రం నిజానికి చాలా కాలం క్రితమే రిలీజ్ కావాల్సి వుంది. కానీ కొన్ని కారణాల వల్ల సెప్టెంబర్ లో విడుదల కానున్నది. ఈ నెల ఇరవై ఏడున ఈ చిత్రం ఆడియో ను రిలీజ్ చేయనున్నారు. సునీల్, షాయాజీ షిండే, వైజాగ్ ప్రసాద్ లు ఇతర ముఖ్య తారాగణం గా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్.పి.పట్నాయక్, జి.వి.ప్రకాష్ లు సంగీతాన్ని అందించారు.
Adhi Oka Idhi Le stills - Movie Stills,
|