Krishna released soldier audio
18-Sep-2008
సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య పాత్రలో బాలాజీ హీరోగా నటించిన చిత్రం సోల్జర్. ఈ చిత్రానికి సంబందించిన ఆడియో విడుదల కార్యక్రమం ఈ రోజు హైదరాబాద్ లో గల ఫిల్మ్ ఛాంబర్ లో సుప్రీం మ్యూజిక్ ద్వారా జరిగింది. కృష్ణ తొలి సి.డి. ని విడుదల చేసి విజయనిర్మలకి అందజేసారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశాన్ని కాపాడేవాడు సైనికుడు, దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప జేసేవాడు క్రీడాకారుడు అన్న పాయింట్ తో ఈ చిత్రం రూపొందిందనీ, ఇందులో సందర్భానుసారం గా ప్రసన్న కుమార్ అందించిన ఐదు పాటలూ చాలా బాగా వచ్చాయనీ సినిమా కూడా చాలా బావుందనీ అందరినీ అలరించే సినిమా అవుతుందనీ కృష్ణ అన్నారు. దర్శకురాలు అయిన విజయనిర్మల మాట్లాడుతూ సెంటిమెంట్ కామెడీ, ఒక కమర్షియల్ సినిమాకి వుండాల్సిన మషాలాలతో పాటూ ఒక చక్కని మెసేజ్ ని ఈ చిత్రం లో పొందుపరచామని సినిమాని చూసినవారు ఎక్కడా బోర్ అన్నది ఫీల్ కారనీ, ప్రస్తుతం ఎడిటింగ్ పనులు జరుగుతున్నాయనీ చిత్రాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు. చిత్ర కధానాయకుడు, నిర్మాత కూడా అయిన బాలాజీ మాట్లాడుతూ ఈ చిత్రం లో ఒకప్పడు సూపర్ డూపర్ హిట్ పాట అయిన తెలుగువీర లేవరా తరహాలో కృష్ణ గారి మీద తీసిన "ఓ భారతీయుడా" పాట మళ్ళీ అంతటి సంచలనాన్ని కలుగుజేస్తుందని అన్నారు. ముఖ్య అతిధి గా పాల్గొన్న నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ విజయనిర్మలగారు గొప్ప దర్శకురాలు, ఎటువంటి క్రిటికల్ సీన్ అయినా సింగిల్ టేక్ లోనే పూర్తి చేయించగల సమర్ధురాలు, అప్పట్లో నేను ఆమె వద్ద అసిస్టెంట్ గా పనిచేయాలని కూడా అనుకొన్నాను అని అన్నారు. ఈ చిత్రం లో సమీర్, చిత్రం భాషా, ప్రియాంక, కొండవలస, రాగిణి, గీతాసింగ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
|