KrishnaNagar struggle as song in Neninthe
24-Aug-2008
సినిమా కష్టాలే కధాంశంగా రవితేజ, సియాలు జంటగా పూరిజగన్నాధ్ దర్శకత్వం లో యూనివర్శల్ మీడియా పతాకం పై దానయ్య నిర్మిస్తున్న చిత్రం నేనింతే. ఈ చిత్రం షూటింగ్ గత ఇరవై రోజులు గా హైదరాబాద్ లో గల సారధి స్టూడియో లో జరుగుతుంది. మొదట అక్కడ వేసిన కోలనీ సెట్ లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం ఇక్కడే రవితేజ మరికొందరు ఆర్టిస్ట్ ల పై ఒక పాటను షూట్ చేస్తున్నారు. ప్రముఖ కొరియో గ్రాఫర్ రాజు సుందరం ఈ పాటకు కొరియోగ్రఫీ ని అందిస్తున్నారు. కృష్ణానగర్ లో సహాయ దర్శకులు పడీ బాధలనూ, వారి ఆనందాలను తెలిపే విధం గా వుండీ ఈ పాటను భాస్కరబట్ల రవి కుమార్ వ్రాయగా చక్రి సంగీతాన్ని అందించారు.
|