గతం లో సుమంత్ హీరో గా జయకృష్ణ నిర్మించిన
" శభాష్ " చిత్రం అంతా పూర్తి
అయిన తర్వాత విడుదల కాకుండా ఆగిపోవడం
జరిగింది. అలాగే శ్రీహరి, మీనా లు
జంట గా " దాసు " పేరు తో ఇంకొక
చిత్రం మొదలయ్యి దాదాపు పూర్తి
అయిపోవస్తున్న సమయం లో ఆగిపోవడం
జరిగింది. ఇప్పుడు ఈ రెండు చిత్రాలు
విడుదలకు నోచుకోనున్నాయి. ఇందులో
శభాష్ చిత్రం చరణ్ ఐపిఎస్ గానూ
దాసు చిత్రం దాసన్న గానూ రానున్నాయి.
నిర్మాత కుమార్ ఈ రెండు ప్రోజెక్ట్
లనూ టేకోవర్ చేసుకొని విడుదల చేస్తున్నారు.
అయితే ఈ రెండిటికన్నా ముందు గతం
లో అప్పారావు కి నెల తప్పింది పేరుతో
రేలంగి నరశింహారావ్ దర్శకత్వం
లో రాజేంద్ర ప్రసాద్ హీరో గా నిర్మితమైన
ఒక చిత్రాన్ని ఇప్పుడు అప్పు చేసి
పప్పుకూడు పేరుతో ఈ నెల నాల్గవ
తారీఖున రిలీజ్ చేస్తున్నామని
నిర్మాత కుమార్ తెలిపారు. ఈ చిత్రాన్ని
విడుదల చేసిన తర్వాత సుమంత్ చిత్రాన్ని
ఆ తర్వాత దాసన్న చిత్రాన్ని విడుదల
చేయాలన్నది తమ వుద్దేశ్యమని ఆయన
తెలిపారు. దాసన్న చిత్రానికి సంభందించి
ఇంకా షూటింగ్ కూడా జరపాల్సి వుందని
ఆ విషయమై తాను శ్రీహరి గారితో కూడా
మాట్లాడడం జరిగిందనీ ఆయన తెలియ
జేసారు.