తరుణ్, జెనీలియా లు జంటగా క్రియేటివ్
దర్శకుడు కృష్ణవంశి దర్శకత్వం
లో మధు మురళి నిర్మిస్తున్న చిత్రం
రెండు షెడ్యూళ్ళ ను పూర్తి చేసుకుంది.
రెండవ షెడ్యూళ్ ముగించుకొని వస్తుండగానే
కృష్ణవంశి గారు ప్రమాదానికి గురి
అయిన సంగతి విదితమే. ఇక ఈ చిత్రం
మూడవ షెడ్యూల్ ఈ నెల పది నుండి మొదలు
కానున్నది. ఈ చిత్రానికి సంగీతాన్ని
విద్యాసాగర్ అందిస్తున్నారు. ఆయన
పలు చిత్రాల పనుల్లొ బిజీ గా వుండడం
వల్ల ఈ చిత్రానికి సంభందించిన మ్యూజిక్
సిట్టింగ్స్ అన్నీ చెన్నై లోనే
జరగనున్నాయి. ప్రముఖ గేయ రచయిత
సిరివెన్నెల సీతా రామ శాస్త్రి
గారూ ఈ చిత్ర నిర్మాత మధు మురళి
ఇప్పటికే చెన్నై చేరుకోగా దర్శకుడు
కృష్ణ వంశి ఈ రోజు చెన్నై వెళుతున్నారు.
ఇప్పటి వరకూ అయిన చిత్రం తాలూకా
పోష్ట్ ప్రొడక్షన్ పనులు హైద్రాబాద్
లోని శబ్దాలయ లో జరుగుతున్నాయి.
కాగా ఈ చిత్రం ద్వారా మరొక్కసారి
తెలుగు లోని కమ్మదనాన్ని తెలుగు
వారికి వంశీ రుచి చూపించనున్నట్లు
గా తెలిసింది.