N.Shankar is the director for NTR Arts NBK film
20-Aug-2008
ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి బాలకృష్ణ హీరో గా రానున్న చిత్రనికి దర్శకుడిగా ఎన్.శంకర్ వ్యవహరించనున్నారు. ఇటీవలే ఈ చిత్రం గురించిన అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ దర్శకుడి వివరాలు అందులో పొందుపరచడం జరగలేదు. నిజానికి అప్పటికి ఇంకా దర్శకుడు ఎవరు అన్న విషయాన్ని కూడా వారు నిర్ణయించనట్లు గా తెలిసింది. ఈ రోజు తెలిసిన విశ్వసనీయమైన సమాచారం ప్రకారం శంకర్ ను దర్శకుడి గా కన్ఫర్మ్ చేసారు. గత కొద్ది కాలంగా ఫిల్మ్ మేకింగ్ కు దూరం గా వున్న శంకర్ కు ఇది ఒక చక్కని అవకాశమనే చెప్పాలి. ప్రస్తుతం దర్శకుల సంఘానికి ఈయన అధ్యక్షులు గా కూడా వ్యవహరిస్తున్నారు.
|
Help reading Telugu font? Telugu text is Unicode encoded. If you have any problems viewing the Telugu text in the article, set the character encoding to Unicode in your browser. In Mozilla, this is accessible from View->Character Encoding->Unicode
|