NTR released Chintakayala Ravi audio
14-Sep-2008
వెంకటేష్, అనూష్క, మమతామోహన్ దాస్ లు జంట గా నటిస్తున్న చింతకాయల రవి చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ రోజు సాయంత్రం రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన విశాల్, శేఖర్ లూ జూనియర్ ఎన్ టి ఆర్ లు ముఖ్య అతిధులు గా పాల్గొన్నారు. ఎన్ టి ఆర్ ఆడియో కేసెట్ ను ఆవిష్కరించి ఏషియన్ ఫిల్మ్స్ అధినేత నారాయణ్ దాస్ కు అందించగా, ఆడియో సి డి ని బ్రమ్మానందం విడుదల చేసి దర్శకుడు శ్రీను వైట్ల కు అందజేసారు. ఈ సందర్భం గా ఎన్ టి ఆర్ మాట్లాడుతూ "ఈ వేదిక మీద ఏం మాట్లాడాలో నాకు తెలియడం లేదు. వెంకటేష్ బాబాయ్ గురించి మాట్లాడేంత అర్హత గానీ వయస్సు గానీ నాకు లేదు, పోనీ సురేష్ ప్రొడక్షన్స్ గురించి మాట్లాడదామా అంటే వారు సాధించిన విజయాల గురించి ఎంత చెప్పినా తక్కువే, అయితే ఇక్కడ వున్న వారిలో ఒకరి గురించి మాత్రం నేను మాట్లాడాలి. నేను స్టూడెంట్ నంబర్ ఒన్ చిత్రం షూటింగ్ లో ఉన్నప్పుడు ఒక రోజు ఒక లావుగా నల్లగా వున్న వ్యక్తి నా దగ్గరకి వచ్చి నా పేరు చిత్రసాయి బుజ్జి, మీకు నప్పే ఒక మంచి కధ మా దగ్గర వుంది, మీతో సినిమా చేయాలనుకొంటున్నాం అన్నాడు సరే మరి డైరెక్టర్ ఎవరూ అంటే వినయ్ ని చూపించాడు ఆరోజు తను మరీ దారుణం గా వున్నాడు, నేనే లావు అనుకొంటే నా కు డబల్ వున్న అతన్ని చూసి వీళ్ళతో ఏం చేస్తాం లే అనుకొని సరే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక సారి కనబడండి అన్నాను. సరె కొన్నాళ్ళ తర్వాత ఒక రోజు మా అమ్మగారు ఎవరో బుజ్జి అంట తెగ ఫోన్ చేస్తున్నాడు అదేంటో చూడు అన్నారు. సరే అని ఫోన్ తీసి కలుద్దాం రండి అన్నాను. అన్నానే గానీ పెద్దగా ఇంట్రస్ట్ చూపలేదు. వాళ్ళు వచ్చి కధ చెప్పారు. అలా వచ్చింది ఆది. నేను ఈ రోజు మీ ముందు ఇలా నిల్చుని మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం ఆ సినిమానే. అటువంటి చిత్రాన్ని నాకిచ్చిన బుజ్జిని నేను ఎప్పటికీ మర్చి పోలేను. ఆ చిత్రం నాకు వినయ్ కి ఎంత పేరు ని తెచ్చినా నిర్మాత గా బుజ్జి కి పెద్ద డబ్బులు తెచ్చిపెట్టలేదు. నేను సురేష్ బాబు గారికి వెంకటేష్ బాబాయ్ కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే మా బుజ్జి కి లక్ష్మి లాంటి సూపర్ హిట్ ఇచ్చి ఒక పెద్ద నిర్మాత గా చేసినందుకు. ఇక పోతే బుజ్జి రోజూ ఈ పాటలు వినమని అనేవాడు. విశాల్ శేఖర్ పాటలు నేను హీందీ లో విన్నాను అవి సూపరే కానీ తెలుగులో వీరెంతవరకూ చేయగలరు అని అనుకొంటూ, కొంచం నిరాసక్తం గానే విన్నాను. బట్ ఇప్పుడు చెబుతున్నాను వీళ్ళు తెలుగులో కూడా విరగదీసారు. మరీ ముఖ్యం గా నహీ చోడూంగా నహీ చోడూంగా పాట సూపర్. డెఫినెట్ గా ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించడం ఖాయం" అని అన్నారు.
వెంకటేష్ మాట్లాడుతూ "ఇరవై ఏళ్ళ నుండీ నన్ను ఎప్పుడూ మాట్లాడమనడం నాకు మాటలు రాకపోవడం కామన్ అయిపోయింది. ఇక ఈ చిత్రానికి విశాల్ శేఖర్ లు అద్బుతమైన మ్యూజిక్ ని అందించారు. అలాగే పాటలన్నీ విజువల్ గా కూడా చాలా బాగా వచ్చాయి. డెఫినెట్ గా ఈ చిత్రం అందరినీ అలరిస్తుందన్న నమ్మకం నాకుంది" అని అన్నారు. విశాల్ శేఖర్ లు మాట్లాడుతూ తెలుగులో తమకు ఇది తొలి చిత్రం అనీ, మ్యూజిక్ అంటే తెలుగువారు చాలా ఇష్టపడతారనీ వారికి నచ్చే మ్యూజిక్ నే తాము ఈ చిత్రం లో ఇచ్చామనీ, చింతకాయల రవి యూనిట్ తో తమకు చాలా అత్మీయ సంబందం ఏర్పడిపోయిందనీ, ఈ చిత్రం ద్వారా తమకు అమూల్యమైన మిత్రులు దొరికినందుకు తాము చాలా సంతోషిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా అనూష్క, మమతా మోహన్ దాస్, సురేష్ బాబు, స్రవంతి రవి కిషోర్, సునీల్, వేణుమాధవ్, బ్రమ్మానందం, శ్రీను వైట్ల, కోన వెంకట్, కొడాలి నాని, శానం నాగ అశోక్ కుమార్, ఈ చిత్ర దర్శకుడు యోగేష్, శ్రీవాస్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
Chintakayala Ravi - Venkatesh - Movie Stills, Ch.Ravi Audio - Events, Ch Ravi Working stills - Events, Ch Ravi Pressmeet - Events, Anushka @ Ch Ravi - Exclusive, Mamatha @ Ch Ravi - Exclusive, Venkatesh @ Ch Ravi - Exclusive,
|