Naga Chaitanya's debut movie launched
20-Sep-2008
చాలామంది ఎదురుచూస్తున్న మరో వారసుని ఆరంగ్రేటం ఈ రోజు అన్నపూర్ణా స్టూడియోస్ లో జరిగిపోయింది. అక్కినేని నాగేశ్వర రావు ఎనభై అయిదవ జన్మదినం అయిన ఈ రోజునే నాగార్జున తనయుడు నాగ చైతన్య హీరోగా వాసు వర్మ దర్శకత్వం లో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం మొదలయ్యింది. చాలా కొద్ది మంది ఆహుతుల మద్య మీడియా కు దూరం గా చాలా నిరాడంబరం గా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసారు. రామానాయుడు కుటుంబం, అక్కినేని కుటుంబం తో పాటూ రాఘవేంద్ర రావు, వి వి వినాయక్ మరికొంతమంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డి.రామానాయుడు తొలి క్లాప్ ను ఇవ్వగా, అక్కినేని కెమెరా స్విచ్ ఆన్ చేసారు. రాఘవేంద్ర రావు మొదటి షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గురించిన ఇతర వివరాలేవీ ఇంకా వెల్లడి చేయడం జరగలేదు. చైతన్య కు జంట గా నటించే అమ్మాయి ని కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. హీరోయిన్ పాత్రకు గానూ మొత్తం ముగ్గురు అమ్మాయిలను సెలెక్ట్ చేసినట్లు తెలిసింది. ఆ ముగ్గురి నుండే ఒక అమ్మాయి ని సెలెక్ట్ చేయనున్నట్లు గా కూడా తెలిసింది.
|
|
|
|
|
|
Copyrights © 2002-2006 TOTALTOLLYWOOD.COM. ALL RIGHTS RESERVED.
|
|