Naresh decided on 1film an year with Deviprasad
18-Sep-2008
నరేష్, సాయాలీ భగత్ లు జంటగా దేవీప్రసాద్ దర్శకత్వం లో సత్య మూవీస్ బ్యానర్ పై సత్యకుమార్ నిర్మిస్తున్న చిత్రం బ్లేడ్ బాబ్జి. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని అక్టోబర్ రెండు న రిలీజ్ చేయడానికి అన్ని సన్నాహాలూ చేస్తున్నట్లు గా నిర్మాత సత్యకుమార్ తెలిపారు. నరేష్ కు కరెక్ట్ గా సూట్ అయ్యే పాత్ర ఈ బ్లేడ్ బాబ్జి అనీ ఆద్యంతం ప్రేక్షకులను నవ్వులలో ముంచెత్తే సినిమాగా దీనిని దేవీప్రసాద్ తెరకెక్కించారని కూడా ఆయన అన్నారు. దర్శకుడు దేవీ ప్రసాద్ మాట్లాడుతూ తాను ఇది వరలో చేసిన ఆడుతూ పాడుతూ గానీ లీలా మహల్ సెంటర్ గానీ కామెడీ బేస్డ్ గానే వుంటాయనీ అదే రీతిలో ఈ చిత్రం కూడా వుంటుందనీ ఇందులో కధ ముఖ్యం గా నరేష్ పాత్ర చుట్టూనే తిరుగుతుందనీ ఒక జేబులు కత్తిరించే వ్యక్తి సడన్ గా ఒక నిర్ణయానికి వస్తాడనీ ఆ నిర్ణయం ఏంటి దాని వల్ల ఎటువంటి పరిణామాలు జరిగాయి అన్న పాయింట్ తో చిత్రం నడుస్తుందనీ, ఈ ప్రయాణం లో నవ్వుల మజిలీలకు కొదవు వుండదనీ అన్నారు. హీరో నరేష్ మాట్లాడుతూ నేను ఇంతవరకూ చేసిన చిత్రాలన్నీ దాదాపు కామెడీ చిత్రాలే, వాటిలో నేను చేసిన ప్రతీ పాత్రా ప్రేక్షకుడిని నవ్వించడానికి చేసిందే. అయితే ఇటువంటి పాత్రలు చేస్తున్నప్పుడు వృత్తి పరంగా సంతృప్తినిచ్చే పాత్రలు అరుదుగా వస్తూ వుంటాయి, ఇందులో నేను చేసిన పాత్ర అలాంటి అరుదైనదే అని చెప్పాలి. ఈ సినిమా చేసేప్పుడే ఇకనుండీ ప్రతీ సంవత్సరం దేవీప్రసాద్ ఒక్క సినిమా అయినా చేయాలనుకొన్నాను అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా ఎ.రాజా, కధ మాటలు వేగ్నేశ సతీష్, సంగీతం కోటి లు అందించారు.
Blade Babjee - Movie Stills,
|