Pawan's next film after Puli is with Puri ???
30-Sep-2008
దాదాపు వందకు పైగా చిత్రాల్లో కమేడియన్ గా నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొన్న నటుడు గణేష్. తనకు నటన తో పాటూ చిత్ర నిర్మాణం మీద కూడా చాలా కాలం గా ఇంట్రెస్ట్ వుందని త్వరలోనే తాను ఒక చిత్రాన్ని నిర్మించనున్నాననీ, నల్లమలుపు బుజ్జి, దిల్ రాజు లను ఆదర్శం గా తాను సంవత్సరానికి ఒక్క చిత్రాన్నైనా నిర్మిస్తాననీ ఆయన ఇటీవల కొంత మంది మీడియా వారి దగ్గర అనన సంగతి విదితమే.
అయితే ఇప్పుడు వినవస్తున్న వార్త ఏమిటీ అంటే గణేష్ నిర్మించబోయే తొలిచిత్రం ఆషామాషీ చిత్రం కాదని. అవును వినవస్తున్న బజ్ ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పూరీ జగన్నాధ్ ల కలయికలో ఈ చిత్రం రానున్నది. పులి చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ చేసే చిత్రం ఇదే అవుతుందని తెలియవచ్చింది. ఏది ఏమైనా మళ్ళీ పవన్ పూరీ కాంబినేషన్ అంటే అది మరొక సంచలనానికే నాంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం పూరీ జగన్నాధ్ నేనింతే షూటింగ్ లో బిజీ గా వున్నారు. దీని తర్వాత సాయిరాం శంకర్ హీరోగా ఒక చిత్రం చేయనున్నారు. ఒక రకం గా చూస్తే పూరి జగన్నధ్ వరుస సినిమాలతో పూర్తి బిజిగా వున్నారు. మరి పవన్ చిత్రాన్ని ఎలా ప్లాన్ చేస్తారు అన్నది చూడాల్సిందే. వేరే వార్తల ప్రకారం ఇటీవల స్వాగతం చిత్రాన్ని నిర్మించిన ఆదిత్యరాం పూరి జగన్నధ్ తో టై అప్ అయ్యి దాదాపు వంద పూరి కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నారనీ, వీరిద్దరు కలిసి వరుసగా సినిమాలు తీయనున్నరని కూడా తెలుస్తుంది. మరి వీటిలో జరిగేది ఏంటి అన్నిది వేచి చూడాల్సిన విషయం.
|
|