Puja Bharathi is doing an Item number in City Life
16-Aug-2008
వేణుమాధవ్ అతిధి పాత్రలో హైదరాబాద్ నవాబ్స్, అంగ్రేజ్, ఎఫ్.ఎమ్ చిత్రాలను నిర్మించి నటించిన ఆర్.కె ప్రధాన పాత్ర గా ప్రముఖ రచయిత సౌదా దర్శకత్వం లో పెర్ఫెక్ట్ విజువల్స్ పతాకం పై వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం సిటీలైఫ్. నవ్వే దమ్ముందా నీలో? అన్న టాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం ఆ లైన్ కి తగినట్లు గానే మొదలు నుండీ తుదివరకూ ప్రేక్షకులను నాన్ స్టాప్ గా నవ్విస్తూనే వుంటుందని దర్శకుడు సౌదా అన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం కోసం హైదరాబాద్, ప్రగతి నగర్ లో వున్న విజయ చందర్ స్టూడియో లో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ మద్య తెలుగు కన్నా హిందీ లో ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్న పూజా భారతి ఈ పాటను చేస్తున్నారు. ఇకపై కూడా ఇలాంటి మంచి నంబర్స్ వస్తే తప్పకుండా చేస్తాననీ, ఈ పాట లిరిక్ కూడా తనకు బాగా నచ్చిందనీ ఆమె అన్నారు. నిర్మాత రాసిన ఈ పాట ఓం వాత్సాయనా అనే పల్లవితో మొదలవుతుంది. ఈ పాటతో షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందనీ సెప్టెంబర్ లో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకొంటున్నామనీ నిర్మాత వెంకటేశ్వరరావు తెలిపారు.
|