Rajeev and Charmi in stunt master Vijay's film
04-Oct-2008
డ్యాన్స్ మాస్టర్లందరూ వరసగా దర్శకులైపోయారు. మరి ఇప్పుడు ఆ వరుసలోనికి స్టంట్ మాస్టర్లు చేరనున్నారా? అలాగే (విని)కనిపిస్తుంది. పలు విజయవంతమైన చిత్రాలకు స్టంట్ లు కంపోజ్ చేసిన విజయ్ మాస్టర్ ఇప్పుడు దర్శకుడిగా మారనున్నారని తెలియవచ్చింది. విశ్వసనీయ వర్గాల కధనం ప్రకారం విజయ్ ఇప్పటికే ఒక చక్కని కధను ప్రిపేర్ చేసుకొని అన్ని విధాలు గా రెడీ అయ్యరనీ ఈ డిసెంబరు లో చిత్రం మొదలు కానున్నదనీ తెలిసింది. "హీరో"ఇన్ ఛార్మి, వెర్శటైల్ ఆర్టిస్ట్ రాజీవ్ కనకాల లు జంటగా ఈ చిత్రం రూపొందనుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ టెక్నీషియన్లందరూ ఈ చిత్రానికి వర్క్ చేయనున్నారని కూడా సమాచారం. ముఖ్యంగా విజయ్ చెప్పిన కధ రాజీవ్, ఛార్మీ లకు బాగా నచ్చి ఈ చిత్రానికి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అన్నీ సక్రమంగా జరిగితే డిసెంబరు లో ఈ చిత్రం మొదలు కానున్నది.
|