Rajendra Prasad to direct Maha Yogi himself ???
13-Aug-2008
కామెడీ చిత్రాల హీరోగా దశాబ్దాల పాటు అందరినీ నవ్వించిన రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలన్నీ విభిన్నమైన కధాంశాలతో కూడుకొన్నవే. అలాగే ఆయన చేసిన ఇటీవలి చిత్రాలు ఆ నలుగురు కానీ, మీ శ్రేయోభిలాషి గానీ విమర్శకుల ప్రశంసలు పొందాయి. ప్రస్తుతం ఆయన షాట్ గన్ మురుగన్ అనే ఆంగ్ల చిత్రం లో కూడా మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ మరొక కొత్త ప్రాజెక్ట్ ని చేయనున్నారు. యోగానంద గురు కధ ఆధారం గా నిర్మితమవనున్న ఈ చిత్రం లో మహాయోగి గా ఈయన నటించనున్నారు. ఈ చిత్రానికి నిర్మాత విజయ్ మాల్యా కావడం మరొక పెద్ద విశేషం. ప్రస్తుతం తాను చేసున్న హాలీవుడ్ ఫిల్మ్ అయిపోయిన వెంటనే ఈ చిత్రం పనులు మొదలు పెట్టనున్నారనీ, ఈ చిత్రం బహుశా ద్విభాషా చిత్రం గా రూపొందనున్నదని కూడా కొన్ని కొన్ని వర్గాల వార్త. . అయితే ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేయనున్నారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే వుంది. దర్శకుడి పేరు, మిగతా నటవర్గ వివరాలు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలూ అన్నీ ఒకేసారి అతిత్వరలోనే వెల్లడి చేయనున్నట్లు గా తెలిసింది. కొసమెరుపు ఏంటీ అంటే ఇన్నాళా నటనానుభవం తో బహుశా రాజేంద్ర ప్రసాదే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశాలు వున్నాయి.
|