Ramaprabha gets Ramineni Visesha Puraskaram
04-Oct-2008
డా.రామినేని ఫౌండేషన్ వారు ప్రతి సంవత్సరం అందజేసే విశిష్ట, విశేష పురస్కారలను ఈ రోజు హైదరాబాద్ లో గల తాజ్ కృష్ణ హోటల్ లో ప్రకటించారు. ఈ అవార్డ్ ల ప్రధానోత్సవం జస్టిస్ చలమయ్య, జయసుధ, మురళీమోహన్ ల సమక్షం లో ఈ నెల పన్నెండున తాజ్ దక్కన్ హోటల్ లో జరగనుంది. ఈ ఏడాది విశిష్ట పురస్కారాన్ని ప్రముఖ శాస్త్రవేత్త కోట హరినారాయణకూ, విశేష పురస్కారాలను మల్లిఖార్జునరావు, సి,వి.రాజగోపాలరావు, నటీమణి రమాప్రభలకు అందజేయనున్నారు. ఈ కార్యక్రమం లో వెంపటి చిన సత్యం గారి ఆధ్వర్యం లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయని సంస్థ అద్యక్షుడు రామినేని వేదాచార్య తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన విలేఖరుల సమావేశం లో సంస్థ కన్వీనర్ ఎ.వి.ఎస్., కో ఆర్డినేటర్ చిత్తరంజన్ లు కూడా పాల్గొన్నారు.
|