Shooting of Mental Krishna completed
18-Aug-2008
రచయిత నటుడు నిర్మాత అయిన పోసాని కృష్ణ మురళి దర్శకత్వం లో మోహన్ వడ్లపట్ల నిర్మిస్తున్న చిత్రం మెంటల్ కృష్ణ. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయిన సంధర్భం గా హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఒక పత్రికా సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కధలో పాత్రపరంగా చాలా ఎగ్రెసివ్ గా హీరోయిన్ ను భయపెట్టే సాడిస్ట్ గా తాను నటించాననీ, ఈ చిత్రాన్ని పూర్తిగా స్టడీ క్యామ్ తో తీసామనీ అనుకొన్నట్లుగా కేవలం ముప్పై ఐదు రోజుల్లో మొత్తం చిత్రాన్ని పూర్తి చేసామనీ, ఈ చిత్రం ద్వారా ఆనంద్ ద్వారా పరిచయమైన సత్య ను తొలిసారిగా హీరోయిన్ ని చేసామనీ ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయిందనీ, ఆమె అద్బుతమైన ప్రతిభను చూసి ఇదే నిర్మాత నిర్మించనున్న గవర్నమెంట్ అనే చిత్రం లో కూడా ఆమెనే హీరోయిన్ గా పెట్టామనీ దర్శకుడు పోసాని అన్నారు. హీరోయిన్ సత్య మాట్లాడుతూ ఇంతవరకూ తాను చిన్న చిన్న పాత్రలు, అక్క వదిన ల క్యారెక్టర్లూ చేసాననీ ఈ చిత్రం తర్వాత ఇక అటువంటి పాత్రలకు స్వస్థి చెప్పాలనుకొంటున్నాననీ అన్నారు. ఈ టివీ ప్రభాకర్ మాట్లాడుతూ ఈ చిత్రం లో తాను హీరోయిన్ కి సోదరుడిగా నటిస్తున్నా అని ఈ చిత్రానికి మెంటల్ కృష్ణ అన్న పేరు ఎందుకు వచ్చింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అని ఈ చిత్రం తో పోసాని గారు మళ్ళీ ఒక పెద్ద హిట్ కొడతారనీ అన్నారు. ఈ చిత్రం లో ఇంకా నాగబాబు, బ్రమ్మానందం, కోట, ఎం.ఎస్.ఎన్, జాకీ లు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందించగా, సినిమాటో గ్రఫీని గాదిరాజు శ్రీనివాస్ అందించారు.
|