Srikanth role in Aa aaa Ee Eee as Sobhan Babu's
21-Aug-2008
శ్రీనివాసరెడ్డి దర్శకత్వం లో శ్రీకాంత్, సదా, మీరాజాస్మిన్ లు ముఖ్య తారాగణం గా నటిస్తున్న చిత్రం అ. . ఆ . . ఇ . . ఈ . . (అతను ఆమె ఇంతలో ఈమె). ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో శరవేగం గా కొనసాగుతుంది. ఈ నెల ఇరవై మూడు తో తొలి షెడ్యూల్ ముగుస్తుంది. ఒక నాలుగు రోజులు గ్యాప్ తరువాత మళ్ళీ రామోజీ ఫిల్మ్ సిటీలోనే రెండవ షెడ్యూల్ మొదలవ్వనుంది. ఈ సినిమాకి గానూ దాదాపు తొంభై శాతం షూటింగ్ ను రామోజీలోనే చిత్రీకరించనున్నారు, కొంత భాగాన్ని రాక్ కేజిల్ లో వేసిన కోలనీ సెట్ లో షూట్ చేస్తామని దర్శకుడు శ్రీనివాస రెడ్డి అన్నారు. ఈ చిత్రం ఒకప్పటి శోభన్ బాబు చిత్రాలను తలపుకు తెస్తుందనీ, ఇందులో శ్రీకాంత్ క్యాబ్ డ్రైవర్ గా నటిస్తున్నారు, ఈ చిత్రం లో ఆయనకు ఇద్దరు. ఆ ఇద్దరి మద్యనా ఈయన ఎలా నలిగిపోతాడు అన్నదే సినిమా. నిజానికి వినడానికి ఇదొక పాత కథ లానే అనిపిస్తున్నా దీనిని నాగేశ్వరరావు అనే అతను రాసారనీ ఇదివరకు ఎన్నడూ లేని ఒక కొత్తపాయింట్ ను ఆయన చెప్పడం వల్లే తాను ఈ చిత్రాన్ని చేస్తున్నానని దర్శకుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రస్తుతం మీరాజాస్మిన్ సీమంతం సీన్ ను షూట్ చేస్తున్నామనీ, ఇక కొద్దిగా గ్యాప్ తో మళ్ళీ తెలుగులో నటిస్తున్న సదా ది ఈ చిత్రం లో చాలా విచిత్రమైన పాత్ర, డెఫినెట్ గా అందరినీ ఆకట్టుకొనే పాత్ర అని కూడా శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి ఎమ్.ఎమ్.శ్రీలేఖ సంగీతాన్ని అందిస్తున్నారు.
|