Srinu Vaitla will be called as Srinu Hitla
24-Sep-2008
ఢీ, దుబాయ్ శీను, రెడీ చిత్రాలతో హ్యాట్రిక్ సక్సస్ సాధించిన శ్రీను వైట్ల పుట్టిన రోజు వేడుకలను ఈ రోజు కామాక్షీ కళా మూవీస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న కింగ్ చిత్రం యూనిట్ సభ్యులు ఘనం గా జరిపారు. నిర్మాత శివప్రసాద్ రెడ్డి, చందన్, అక్కినేని వెంకట రత్నం, కెమెరామేన్ ప్రసాద్ మూరెళ్ళ ఇంకా ఈ చిత్రం లో నటిస్తున్న జయప్రకాష్ రెడ్డి, బెనర్జీ తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఇరవైనాలుగు గంటలూ సినిమా గురించే ఆలోచించే శ్రీను ఇలాంటి హ్యాట్రిక్ లు మరెన్నో సాదిస్తారనీ తమ కింగ్ చిత్రం మరో హ్యాట్రిక్ కి నాంది అవుతుందని నిర్మాత శివప్రసాద్ రెడ్డి అన్నారు. శ్రీను వైట్ల ఇకనుండీ శ్రీను హిట్ల గా పిలవబడతాడని నటుడు జయప్రకాష్ రెడ్డి అభినందించారు. నాగార్జున శ్రీను వైట్ల కు ఫోన్ లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం యూనిట్ సభ్యులందరి సమక్షం లో శ్రీను వైట్ల కేక్ ను కట్ చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ " ఇది నా లైఫ్ లో బాగా ఎక్సైట్ అవుతున్న బర్త్ డే. ఎందుకంటే విజయాల హ్యాట్రిక్ తర్వాత వచ్చిన పుట్టిన రోజు ఇది. రెడీ వందరోజులు పూర్తి చేసుకొంటున్న టైమ్ లోనే నాగార్జున గారితో కింగ్ చేయడం నా అదృష్టం. తప్పకుండా ఈ కింగ్ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది " అని అన్నారు.
|