సుమంత్ హీరోగా రాజ్ దర్శకత్వం లో
గ్రీన్ మ్యాంగోస్ బ్యానర్ పై రమణ
గోగుల ఒక చిత్రాన్ని నిర్మిస్తున్న
సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి
బోణీ అన్న పేరుతో చలామణి అవుతున్న
ఈ చిత్రం నిర్మాత ఇటీవల ఒక చేదు
అనుభవాన్ని చవిచూసినట్లుగా తెలిసింది.
ఈ చిత్రం షూటింగ్ కోసమై ఒక ఇంటిని
వారు సెలెక్ట్ చేసుకోగా సదరు ఇంటి
యజమాని వారు చెప్పిన అద్దెకు కూడా
అంగీకరించి, తీరా ఆ చిత్రం యూనిట్
షూటింగ్ కోసం ఆ ఇంటికి వచ్చినపుడు
తన ఇంట్లో ఫ్లాష్ లైట్ లు వేయకూడదనీ
తన ఇంటి బాత్ రూమ్ లు వాడకూడదనీ
ఇంకా ఇలాంటి ఆంక్షలు విధించింది.
దీంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో
సగం మంది యూనిట్ సభ్యులు ఇంటి బయట
వుండగానే ఆమె తన ఇంటి ముఖ ద్వారాన్ని
మూసివేసింది. దీనివల్ల చాలాసేపటి
వరకూ షూటింగ్ జరగలేదు. అయితే ఆ ఇంటిని
వారికి షూటింగ్ కోసమై ఇప్పించిన
ఒక వ్యక్తి కలుగజేసుకోవడం వల్ల
యేదో అయ్యింది అన్నట్లుగా ఆ రోజుకి
షూటింగ్ ముగించి అక్కడ నుండి ఆ చిత్ర
యూనిట్ బయట పడినట్లుగా తెలిసింది.
ఈ ఇంటి యజమానురాలు నగరం లో పెరెన్నిక
గన్న ఒక పెద్ద పబ్ కి కూడా యజమానురాలు
కావడం విశేషం.