Click here to watch exclusive 1 minute clipping of Keka only on TotalTollywood.com
చాలా కాలం తర్వాత చిత్రం మూవీస్
పతాకం పై వస్తున్న చిత్రం కేక. దాదాపు
గా నూతన తారాగణం తో నిర్మితమవుతున్న
ఈ చిత్రం దాదాపు గా పూర్తి అయ్యింది.
జూలై ఆరు నుండి తొమ్మిది వరకూ ఈ
చిత్రం యూనిట్ మిగిలి వున్న ఒక పాట
చిత్రీకరణ కోసం రాజస్తాన్ పర్యటించనున్నది.
హీరో హీరోయిన్ల మీద జైసల్మీర్,
జైపూర్, జోధ్ పూర్, ఉదయ్ పూర్ వంటి
పలు ప్రాంతాల్లో ఈ పాటను చిత్రీకరించనున్నారు.
పి.సి.శ్రీరామ్ అందించిన అద్భుతమైన
విజువల్స్ తో రానున్న ఈ చిత్రానికి
చక్రి సంగీతాన్ని అందించారు. అయితే
రెగ్యులర్ చిత్రాల వలే ఈ చిత్రం
ఆడియో ను సినిమాకి ముందు రిలీజ్
చేయడం లేదని దర్శకుడు తేజ టోటల్
టాలీవుడ్ కు తెలిపారు. ముందుగా
ఒక నిముషం పాటు పాటలను ఎఫ్.ఎమ్.రేడియో,
ఇంటర్ నెట్ మాధ్యమాల ద్వారా ప్రేక్షకుల
మద్యకు తేవాలన్నది తన అభిమతమనీ,
ప్రస్తుతం ఆడియో రంగ పరిస్థితి
అంత యేమీ బాగోలేదనీ, ఆడియో పైరసీ
కూడా బాగా పెరిగిపోయిందనీ అందుకే
తన చిత్రం పాటలను సినిమా రిలీజ్
చేసిన తర్వాతనే విడుదల చేయాలన్న
ఆలోచనలో వున్నానని ఆయన తెలిపారు.
అలాగే ఈ చిత్రం యొక్క మొదటి విజువల్
ను కూడా ఇంటర్నెట్ మాధ్యమం ద్వారానే
ఆయన విడుదల చేయడం జరిగింది. ఆ అవకాశాన్ని
టోటల్ టాలీవుడ్ దక్కించుకుంది.
పి.సి.శ్రీరాం, తేజ ల కేక వీడియో
ను మీరు ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా
చూడవచ్చు. ( ఈ చిత్రం గురించి మరిన్ని
ఎక్స్ క్లూజివ్ వివరాల కోసం వేచి
చూడండి. )