Teja's sentiment with Harihara Kalabhavan?
24-Aug-2008
కలకత్తా లో ఒక షెడ్యూల్ ని ముగించుకొని వచ్చిన ఈ చిత్రం యూనిట్ ఈ చిత్రం లో చివరి పాటను షూట్ చేయడం లో బిజీగా వుంది. దర్శకుడు తేజ తన గత సూపర్ హిట్ చిత్రాలైన చిత్రం, నువ్వునేను ల్లో ఒక్కొక్క పాటను హైదరాబాద్ లొ గల హరిహరకళా భవన్ లో చిత్రీకరించారు. బహుశా మరి అదే సెంటిమెంట్ తో కావచ్చు ఇప్పుడు కూడా అదే హరిహరాకళాభవన్ లోనే షూట్ చేస్తున్నారు. నృత్యదర్శకురాలు సుచిత్రా చంద్రబోస్ ఈ పాటకు కొరియోగ్రఫీని అందిస్తున్నారు. ఇక్కడ షూట్ చేయడం మీ సెంటిమెంటా అని దర్శకుడు తేజా ను అడిగినప్పుడు తనకు అలాంటి సెంటిమెంట్స్ ఏమీ వుండవనీ, ఈ పాటను షూట్ చేయడానికి ఒక ఆడిటోరియం కావాలి, వేరే వాటిని ట్రై చేసినప్పుడు అవి దొరకక పోవడం తో ఇక్కడ చేస్తున్నాను అని అన్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరాం సినిమాటోగ్రఫీని, చక్రి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ద్వారా గేయరచయిత సిరివెన్నెల గారి ఆబ్బాయి రాజా హీరో గా పరిచియం కానున్నాడు.
Keka - Movie Stills, Baby in Keka - Exclusive,
|