Trivikram penned lyrics for Pawan's Puli?
24-Aug-2008
జల్సా చిత్రం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆల్ మోస్ట్ ఒక్స్ షెల్ లోనికి వెళ్ళిపోయారు అనే చెప్పాలి. నిజానికి ఆయన మహేష్ బాబు తో చేయబోయే తన తదుపరి చిత్రం పనుల్లో బిజీ గా వున్నారు. దాదాపు గా మొత్తం రెడీ అయ్యి అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ చిత్రం లొ పార్వతి మెల్టన్ ని హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసారు. అయితే అప్పుడప్పుడూ పాటలు రాసే అలవాటు వున్న త్రివిక్రమ్ ఇటీవల చింతకాయల రవి చిత్రం కోసం ఒక పాటను రాసిన సంగతి తెలిసిందే. గతం లో కూడా యోగి చిత్రానికి పాటలు అందించిన త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో వున్న సాన్నిహిత్యం వల్ల పవన్ కళ్యాణ్ మోస్ట్ ఎవైటెడ్ మూవి అయిన పులి కి కూడా ఒక పాటను వ్రాయనున్నట్లు గా తెలిసింది. డైలాగ్స్ వ్రాయడం లో జెమ్ అనిపించుకొన్న త్రివిక్రమ్ రాసే పాటలు కూడా ఆ స్థాయిలోనే వుంటాయంటే అది అతిశయోక్తి కానే కాదు.
|
Help reading Telugu font? Telugu text is Unicode encoded. If you have any problems viewing the Telugu text in the article, set the character encoding to Unicode in your browser. In Mozilla, this is accessible from View->Character Encoding->Unicode
|