Vasanth will get good name with One : MMK
15-Sep-2008
మాస్టర్ ఎన్.టి.ఆర్. సమర్పణ లో 9 Entertainments పతాకం పై కృష్ణతేజ దర్శకత్వం లో నల్లా చరణ్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ఒన్. వడ్డే నవీన్, ఆర్తి లు జంట గా నటిస్తున్న ఈ చిత్రం ఆడియో ఈ రోజు రాత్రి హైదరాబాద్ లో గల ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ప్రసాద్స్ అధినేత శ్రీ రమేష్ ప్రసాద్, అదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఇంద్రకరణ్ రెడ్డి లు ముఖ్య అతిధిలు గా పాల్గొన్నారు. మొదటి కేసెట్ ను రమేష్ ప్రసాద్ విడుదల చేసి ఇంద్రకరణ్ రెడ్డి కి అందజేయగా, ఆడియో సి.డి ని కీరవాణి విడుదల చేసి అచ్చిరెడ్డి కి అందజేసారు. ఈ రోజుల్లో చాలామంది ఫేమ్ కోసమో మనీ కోసమో సినిమా రంగం వైపు ఎక్కువ గా వస్తున్నారనీ, అయితే ఒక కమిట్ మెంట్ తో పనిచేస్తేనే వారికి విజయం దక్కుతుందనీ, ఈ చిత్రం యూనిట్ అంతా యువరక్తం తో నిండివుందని తప్పకుండా ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి వీరందరికీ మంచి భవిష్యత్ ను ఇవ్వాలని తాను కోరుకొంటున్నా అని రమేష్ ప్రసాద్ అన్నారు. ఎమ్.పి. ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడో ఆదిలాబాద్ లోని వెనుకబడ్డ ప్రాంతమైన నిర్మల్ నుండి వచ్చిన చరణ్ రెడ్డి నిర్మాత గా మారడం అభినందనీయం అనీ ఒక చక్కని అభిరుచి వున్న రెడ్డి మంచి చిత్రాన్నే తీసివుంటాడని తాను నమ్ముతున్నాననీ, ఈ చిత్రం వారందరికీ మంచి భవిష్యత్ ను ఇవ్వాలనీ తారు కోరుకొంటున్నానని అన్నారు. కీరవాణి మాట్లాడుతూ ఇదివరకు నవీన్ చిత్రం అయిన పెళ్ళి కి తాను మ్యూజిక్ చేయాల్సి వుండిందనీ కానీ ఎందువల్లనో అది సాద్యపడలేదని తర్వాత ఎస్ ఎ రాజ్ కుమార్ చేయడం ఆ ఆల్బం పెద్ద హిట్ అవ్వడం అందరికీ తెలిసిందేనని, మరి ఈ చిత్రం ద్వారా పరిచయం కానున్న వసంత్ కి కూడా అంత పేరు రావాలని కోరుకొంటున్నానని అన్నారు. వడ్డె నవీన్ మాట్లాడుతూ మణిశర్మ దగ్గర అసిస్ట్ చేసిన వసంత్ చాలా అద్బుతమైన మెలొడీలను అందించాడనీ డెఫినెట్ గా ఈ చిత్రం ఆడియో పెద్ద విజయాన్ని సాధిస్తుందనీ అన్నారు. "ఈ చిత్రం ద్వారా తాను చాలామందిని పరిచయం చేస్తున్నా అని ముందు అనుకొన్నా, ఇప్పుడు పూర్తి అయిన తర్వాత తెలిసింది ఒక మంచి టీమ్ కి నేను పరిచయం అయ్యానని" అన్నారు నిర్మాత చరణ్ రెడ్డి. కాగా ఈ ఒన్ ను అక్టోబర్ లో రిలీజ్ చేయాలనుకొంటున్నాం అని దర్శకుడు కృష్ణతేజ తెలిపారు.
ఈ ఆడియో విడుదల కార్యక్రమం లో ఇంకా కె.ఎస్.రామారావు, చలపతి రావు, అమిత్, గాయకులు గిరిధర్, హేమచంద్ర, డ్రాగన్ ప్రకాష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
|