YVS, Vishnu combo Saleem started
14-Aug-2008
గతం లో వై వి ఎస్ చౌదరి దర్శకత్వం లో విష్ణు, ఇలియానాలు జంటగా సలీం దుమ్ము రేపుతాడు అనే చిత్రం రానున్నదని టోటల్ టాలీవుడ్ లో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఈ చిత్రం గురించి విశేషాలు అఫీషియల్ గా తెలియజేసారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబరు ఒకటి నుండీ మొదలు పెట్టి డిశెంబరు కి పూర్తి చేయనున్నామనీ, ఇదొక పూర్తి స్థాయి వినోదాత్మక, వైవిద్యభరిత ప్రేమకధ అనీ, ఇది అమెరికా, ఇండియా బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందనీ, ఈ చిత్రం కోసం విష్ణు చాలా సన్నబడ్డాడనీ ఇప్పుడు తను మరింత ఆకర్షణీయం గా కనబడుతున్నాడనీ మోహన్ బాబు అన్నారు. దర్శకుడు వై వి ఎస్ మాట్లాడుతూ డెఫినెట్ గా ఇదొక చక్కని ఎంటర్ టైనర్ అవుతుందనీ ఈ చిత్రానికి హైలైట్ మోహన్ బాబు గారు ఈ చిత్రం లో డాన్ గా నటించడం అనీ, అది కూడా పూర్తి గా ఎంటర్టైన్ చేసే పాత్ర అనీ అలాగే ఇలియానా ది ఈ చిత్రం లో కంప్లీట్ మొడ్రన్ పాత్ర అనీ, మోహన్ బాబు గారి కి ఇంకా హీరోయిన్ ఎంపిక చేయాల్సి వుందనీ అన్నారు. ఈ చిత్రం లో ఇంకా బ్రమ్మనందం, భరణి, ఆలి, హేమ, తెలంగాణా శకుంతలు తదితరులు నటిస్తుండగా రాం ప్రసాద్ సినిమాటోగ్రఫీనీ, చంద్రబోస్ సాహిత్యాన్ని అందిస్తున్నారు.
|