Login Password Register? Forgot passwd?
    Home  |  News  |  Gallery  |  Interviews  |  Reviews  |  Wallpapers  |  Music  |  Videos  |  Showtimes  |  Movies  |  Profiles                    19 Mar 2010

Gunde Jallumandi
Movie Review : 3/5
by


Gunde Jallumandi
StoryMadan
Screenplay Madan
DirectionMadan
CameraJ Prabhakara Reddy
EditingK V Krishna Reddy
MusicMM Keeravani
DialogsMadan
ArtT Nagendra Prasad
Action
Presenter Parachoori Kireeti
Producer Parachoori Sivarama Prasad
Banner
ReleaseSep-12-2008
Reviewed onSep-12-2008
*ing: Ajay, Venumadhav, Dharmavarapu, Aditi Sarma, Udaykiran
Movie Links
Gunde Jallumandi (12/09/08)
Gunde Jallumandi opens with 7 premieres in USA (11/09/08)
Gunde Jallumandi to release on 12th September (27/08/08)
Gunde Jallumandi - Udaykiran - Movie Stills
Gunde Jallumandi - Udaykiran - Movie Stills
Gunde Jallumandi - Wallpapers
User Reviews 16
Post your review
Movie Review
Average User rating: 4


ఆ నలుగురు చిత్రం తో ఒక మంచి రచయితగా గుర్తింపు తెచ్చుకొని పెళ్ళైన కొత్తలో చిత్రం ద్వారా దర్శకుడి గా కూడా తనను తాను నిరూపించుకొన్న మదన్ కి దర్శకుడి గా ఇది రెండవ చిత్రం. పెళ్ళైన కొత్తలో చిత్రం ద్వారా ఒక చక్కని మెసేజ్ ని వినోదాత్మకం గా చెప్పిన మదన్ ఈ చిత్రం ద్వారా ఈ చిత్రం లో ఏ మెసేజ్ ల జోలికీ పోకుండా ప్రేమికుల భావాలను భావాత్మకం గా తెరకెక్కించే ప్రయత్నం చేసాడు. ఈ ప్రయత్నం లో కొన్ని కొన్ని లోటుపాట్లు వున్నప్పటికీ మొత్తం మీద తాను అనుకొన్న దానిని చెప్పడం లో సక్సీడ్ అయ్యాడనే చెప్పాలి. ఇక కధ విషయానికి వస్తే, నీలు (అదితి శర్మ) కి మగవాళ్ళంటే అస్సలు పడదు. దానికి ఆమె కారణాలు ఆమెకుంటాయి. పదవతరగతి లోనే ప్రేమలో పడి తన జీవితాన్ని తానే స్పాయిల్ చేసుకొన్న అక్క ను చూసి మగవాళ్ళు వున్నదే ఆడవాళ్ళ జీవితాలు పాడుచేయడానికి అన్నట్లు గా భావిస్తూ తనవద్దకూ ఎవరినీ రానివ్వకుండా జాగ్రత్త పడుతుంది. అయితే దానికోసం ఆమె తాను ఆల్రెడీ రాజేష్ అనే ఒక వ్యక్తి తో ప్రేమలో వున్నట్లు గా అందరినీ నమ్మిస్తూ వుంటుంది. జీవితం ఇలా సాఫీ గా వెళ్ళిపోతున్న సమయంలో ఆమె చదువుకొనే కాలేజ్ కి బాలరాజు (ఉదయ్ కిరణ్) వస్తాడు. చదివుకోవాలనే తపన తో పల్లెటూరు నుండి వచ్చిన బాలరాజు నీలు ని ఇష్టపడతాడు. మొదట్లో బాలరాజు ని కూడా దూరం గానే వుంచిన నీలు నెమ్మది నెమ్మది గా అతనంటే ఇష్టపడడం మొదలు పెడుతుంది. ఇక ఇద్దరూ ఒకరి ప్రేమలో ఒకరు మునిగిపోతున్న సమయం లో నీలు మగవాళ్ళను దగ్గరకు రానివ్వకుండా క్రియేట్ చేసిన రాజేష్ క్యారెక్టర్ తెరమీదకు వస్తుంది. అక్కడి నుండి కధ అనేక మలుపులు తిరగడం మొదలు పెడుతుంది. తనంతట తానే సృష్టించిన ఈ రాజేష్ పాత్ర నుండి నీలు ఎలా తప్పించుకొంది, బాలరాజు నీలుని రాజేష్ నుండి రక్షించుకోగలిగాడా, అసలు ఈ రాజేష్ అన్నవాడెవడు లాంటి విషయాలను తెరమీద చూస్తేనే బావుంటుంది.

నటీ నటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ వారి వారి పాత్రలకు తగినట్లు గా చేసారే తప్ప అద్భుతం అనేంతగా ఎవరూ పెర్ఫార్మ్ చేయలేదనే చెప్పాలి. ఉదయ్ కిరణ్ ఇంతకు ముందు సినిమాల కన్నా లావు గా కనబడ్డాడు. కొత్తమ్మాయి అదితి మొదటి సినిమానే అయినా సీజన్డ్ ఆర్టిస్ట్ లానే చేసింది. కొన్ని కొన్ని ఏంగిల్స్ లో ఈ అమ్మాయి చాలా బావుంది. ఈ చిత్రం తో ఈ అమ్మాయికి మరికొన్ని అవకాశాలు రావడం మాత్రం ఖాయం. ఇక అజయ్ పాత్ర గురించి కూడా ఇక్కడ కొంచం చెప్పుకోవాలి. తాను చేసే పాత్ర నిడివి ఎంత తక్కువ అయినా ఆ వున్నంత సేపూ ప్రేక్షకుల దృష్టి ని ఆకట్టుకోవడం లో ఈ నటుడు ఎప్పుడూ ముందుంటాడు. ఈ చిత్రం లో కూడా అతని క్యారెక్టరైజేషన్ గానీ దానిని అతను పెర్ఫార్మ్ చేసిన తీరు గానీ చాలా బావుంది. అయితే చాలా సినిమాల్లో లానే ఈ చిత్రం లో కూడా ఈ పాత్ర నిడివి తక్కువే. (అందుకేనేమో అజయ్ నే హీరోగా పెట్టి ఇదే మదన్ ఈల అనే చిత్రాన్ని తీయబోతున్నాడు) ఇక కామెడీ విషయం లో కూడా ఈ చిత్రం లో చెప్పుకోదగినన్ని నవ్వులు లేవు. మొదటి చిత్రం పెళ్ళైన కొత్తలో తో కంపేర్ చేస్తే ఆ చిత్రం లోనే కామెడీ బావుందని చెప్పవచ్చు. వేణుమాధవ్ గానీ ధర్మవరపు సుబ్రమణ్యం గానీ ఈ విషయం లో చిత్రానికి పెద్ద గా హెల్ప్ కాలేకపోయారు అనే చెప్పాలి.

ఇక సాంకేతికం గా ఈ చిత్రం గురించి చెప్పాలంటే ముందుగా సినిమాటొగ్రఫీ గురించి చెప్పాలి. జె,ప్రభాకర రెడ్డి చక్కని విజువల్స్ ని అందించారు. లావుగా అనిపించినా ఉదయ్ కిరణ్ గానీ అదితి గానీ చక్కగా కనిపించారు అంటే దానికి ఈయనే కారణం అని చెప్పాలి. కీరవాణి తానెంతో ఇష్టపడి చేసిన సినినా ఇది అని ఎంత చెప్పినప్పటికీ ఈ చిత్రం లోని టైటిల్ సాంగ్ తప్పా మిగతావి పెద్ద ఆకట్టుకొనే పాటలు కావు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే వుంది. కె.వి.కృష్ణారెడ్డి ఎడిటింగ్ బానే వుంది. అక్కడక్కడా మరికొంత క్రిస్ప్ గా వుంటే ఇంకా బావుండేది. ఇక చివర్లో చెప్పుకోవాల్సింది మన ఆల్ రౌండర్ మదన్ గురించి. ఈ చిత్రానికి కధ, కధనం, మాటలు, దర్శకత్వం అన్నీ చేపట్టిన మదన్ తన బాద్యతలన్నీ చక్కగానే ఫుల్ ఫిల్ చేసాడు. ఈ చిత్రం ద్వారా యువతను ఆకట్టుకోవాలనే అతని కోరిక దాదాపు నెరవేరినట్లే. డెఫినెట్ గా కాలేజ్ గోయింగ్ పిల్లలు ఈ చిత్రాన్ని ఇష్టపడే అవకాశాలు ఎక్కువగానే వున్నాయి. అయితే రెవెన్యూ పరం గా బాగా క్లిక్ అవ్వాలి అంటే ఒక్క యువత మాత్రమే చూస్తే సరిపోదు అన్న విషయం కూడా గమనించాలి. సినిమా మొదటి అర్ధ భాగం మంచి టెంపో తో చాలా ఫాస్ట్ గా నడిచిపోయి బావుందన్న ఫీల్ కలుగుతుంది. అయితే సెకెండ్ హాఫ్ లో అక్కడక్కడా కొన్ని సీన్లు బోర్ కొట్టిస్తాయి. కామెడీ విషయం లో సెకెండ్ హాఫ్ లో కూడా కొంచం శ్రద్ద తీసుకొన్నట్లైతే డెఫినెట్ గా ఈ గుండె జల్లుమంది చిత్రం మంచి విజయాన్ని సాధించేది. ఏది ఏమైనా ఉదయ్ కిరణ్ మాత్రం ఈ చిత్రం తో కొంచం ఊపిరి పీల్చుకోవచ్చు. టోటల్ గా చెప్పాలంటే గుండె జల్లుమంది చిత్రాన్ని ఒక సారి చూడవచ్చు. ఇక ఈ చిత్రం రెవెన్యూ పరం గా ఎలా కలెక్ట్ చేస్తుంది అన్న విషయం రాబోయే రోజుల్లోనే తెలియాలి. ఎందుకంటే మదన్ చిత్రాలన్నీ నెమ్మదిగానే పుంజుకొంటాయి



Post your review
Only registered users can rate the film. To rate the film please login
Login Password Register? Forgot passwd?
(Scale: 1-Worst/Avoid 2-Below Average 3-Average/one see 4-Good/Must see 5-Excellent)
Subject/Headline
Comment
User Reviews
Total number of reviews - 5

must watch
by anon user on 2008-09-13
Rating:

nice entertainer aditi is 2222222 good

cool
by anon user on 2008-09-12
Rating:

i think it is a good movie; my rating is a 5


by anon user on 2008-09-13
Rating:

its agood movie................ 4


by anon user on 2008-09-14
Rating:

nice movie

Must see
by anon user on 2008-09-16
Rating:

I am sure, you wil enjoy this movie.. Aditi and Uday pair is pretty good.

SEE ALL REVIEWS >>
Syndicate  |   Contact us  |   Disclaimer  |   Feedback
Copyrights © 2002-2006 TOTALTOLLYWOOD.COM. ALL RIGHTS RESERVED.