TotalTollywood Logo
23 Apr 2014
Login Password Register? Forgot passwd?

Hero
Movie Review : 1.75/5
by


HERO
StoryGV
Screenplay GV
DirectionGV
Camera
Editing
Music
Dialogs
Art
Action
Presenter
Producer Manyam Ramesh
Banner
ReleaseN/A
Reviewed onOct-24-2008
*ing: Nitin, Bhavana, Nagendra Babu, Ramyakrishna, Kovai Sarala
Movie Links
HERO (24/10/08)
Hero by GIF in overseas (13/10/08)
Audio of Hero released by Srikanth (24/09/08)
GV has potential of mass director: Naga Babu (01/09/08)
Hero - Movie Stills
Hero (working stills) - Exclusive
User Reviews 0
Post your review
Average User rating:


ఈ మద్య కాలం లో విడుదల అయిన సినిమాల పరిస్థితి చూస్తూ వుంటే మన తెలుగు సినిమా కి ఏదో తెగులు పట్టిందేమో అనిపిస్తూ వుంది. కొన్ని సెన్సిబుల్ మూవీస్ వచ్చినప్పటికీ వాటి నిష్పత్తి 1: 10 లా వుంది అనే చెప్పాలి. ప్రతి దర్శకుడూ తామొక డిఫరెంట్ చిత్రాన్ని తీస్తున్నామని ఇటువంటి కధ అయితే మాత్రం ఇంతవరకూ రాలేదనీ, లేదా ఇటువంటి కధనం తెలుగులో ఇదే మొదటిసారి అనీ సినిమా విడుదల కు ముందు ఎన్నెన్నో చెప్పినా సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసే ప్రేక్షకుడు ఇంటర్ వెల్ కే బయటకు పారిపొయే విధం గా వుంటుంది. సినిమా మొత్తం మీద ఏదో ఒక్క సీన్ నో, లేదా ఒక్క పాటనో అద్బుతం గా తీసినంత మాత్రాన మొత్తం సినిమా ని అంతా భరించలేం కదా. నిజానికి ఆ అద్బుతం గా తీసినా సీన్లనో లేక సదరు పాటలనో ట్రైలర్స్ గా రిలీజ్ చేయడం ద్వారా అబ్బో ఇదేదో బాగుండే లా వుంది అని డబ్బులు పెట్టుకొని సినిమాకి వెళ్ళిన ప్రేక్షకుడిని ఆయా సినిమాలు నానా హింస కు గురిచేస్తున్నాయి అంటే అతిశయోక్తి కానే కాదు. ఇక ఈ రోజు రిలీజ్ అయిన హీరో సినిమా కూడా దాదాపు ఇలాంటిదే కావడం వల్ల ఈ ఉపోధ్ఘాతం అంతా చెప్పాల్సి వచ్చింది. కధ గానీ కధనం గానీ ఏవీ ఒక పద్దతి లో లేకుండా కొన్ని కేవలం కొన్ని సీన్లను (అవి కూడా చాలాకాలం క్రితం హాలీవుడ్ సినిమాల్లో చూసినవే సుమా) అద్బుతం గా తెర మీద చూపడం తప్పా ఇంకేమీలేని చిత్రం ఈ హీరో. దర్సకుడి గా సుధాకర్ నాయుడి కి ఇదే తొలి చిత్రం అని ఈజీ గా చెప్పేయవచ్చు. ఒక సీన్ కీ ఒక సీన్ కి సంభందం వుండదు. ఎప్పుడు పాటొస్తుందో ఎప్పుడు ఫైట్ వస్తుందో అసలవెందుకు వస్తున్నాయో కూడా చూసే ప్రేక్షకుడి కి అర్ధం కాదు. టోటల్ గా చూస్తే ఇదో పెద్ద బుర్ర తిరుగుడు చిత్రం అనే చెప్పాలి. సరే అవన్ని ఎందుకు గానీ సింపుల్ గా దీని స్టోరీ ఏంటీ అంటే ( సింపుల్ గా అన్నాను గానీ అవును ఏంటి దీని స్టోరీ అని ఆలోచించడానికి నాకు అరగంట పట్టింది) నాగేంద్ర నాయుడు (నాగెంద్రబాబు) జానకి (కోవై సరళ) ల ముద్దుల కుమారుడు రాధా కృష్ణ (నితిన్). తండ్రి కేమో కొడుకుని పెద్ద పోలీస్ ఆఫీసర్ గా చేయాలనీ, తల్లికేమో కొడుకుని పెద్ద సినిమా హీరో ని చేయాలనీ వుంటుంది. ఇక మన హీరో కూడా తల్లి మాటే వింటూ జులాయి గా తిరిగేస్తూ కాలం వెళ్ళబుచ్చేస్తూ వుంటాడు. సరే ఇటువంటి టైమ్ లో ఒక ఛానల్ వారు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం లో హోమ్ మినిస్టర్ (బాబూ మోహన్) నిజాయితీ వున్న ఎవరైనా పోలీస్ డిపార్ట్ మెంట్ లో జాయిన్ కావచ్చు అన్న జీ.వో ను పాస్ చేస్తాడు. దాంతో లొట్టు లొటారం బ్యాచీ అంతా ఈ పోలీస్ అకాడమీ కి చేరతారు. అందులో మన రాధా కృష్ణ అండ్ బ్యాచ్ కూడా వుంటారు. అలాగే అక్కడికి కృష్ణవేణి (భావన) అనే అమ్మాయి కూడా చేరుతుంది. మన రాధా కృష్ణ కి కృష్ణ వేణి కి మద్య న కొంచం ప్రేమ చిగురిస్తుందీ అన్న సమయం లో ఆమె గురించిన ఒక దారుణమైన నిజం బయట పడుతుంది. అయితే అదంతా కల్పితం అనీ ఆమె ఒక చాలా కీలకమైన కేస్ లో సాక్షి అనీ ఆమెను కోర్ట్ కు చేర్చే భాద్యత నీదే అనీ కమీషనర్ నాగేంద్ర నాయుడు, అకాడమీ ఆఫీసర్ (రమ్యకృష్ణ) త్రివేణి లు రాధా కృష్ణ తో చెబుతారు. ఇక అక్కడి నుండీ మన హీరో హీరొయిన్ ని ఎలా కాపాడాడు, విలన్ లని ఎలా పట్టుకొన్నాడు, అతను చివరికి సినిమా హీరో అయ్యి తల్లి కోరిక నెరవేర్చాడా లేక పోలీస్ ఆఫీసర్ అయ్యి తండ్రి కోరిక నెరవేర్చాడా అన్నదే ఈ చిత్ర కధ.

ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నితిన్ తన పరిధి లో బాగానే చేసాడు. కానీ అతని వాచకం ఇంకా మెరుగుపడాల్సి వుంది. పాటల్లో డ్యాన్స్ ఆకట్టుకొనేలానే వుంది. ఇక అతని నటన ని పేద్ద చూపించేడానికి అంటూ అతనికి అంత భారమైన సీన్లు కూడాలేవు. ఇక భావన, అమాయకం గా కనిపిస్తూనే అవతలి వారి బుర్రలు తినేసే అమ్మాయిలా చాలా చక్కగా చేసింది. తను చక్కని పెర్ఫార్మరే గానీ తన టాలెంట్ ను చూపించుకొనె అవకాశాలే తనకు రావడం లేదు. నాగేంద్ర బాబు, కోవై సరళ (ఈమె అతి గురించి తెలిసిందేగా), రమ్యకృష్ణ లు వారి వారి పాత్రలకు న్యాయం చేకూర్చారు. కామెడీ అంటూ ప్రత్యేకం గా చెప్పుకోవడానికి ఏమీ లేదు. బ్రమ్మానందం, తిరుపతి ప్రకాష్, సత్యం రాజేష్, ఆలి తదితరులు నవ్వించడానికి చాలా ప్రయత్నాలు అయితే చేసారు మరి నవ్వడమా లేదా అన్నది ప్రేక్షకుడి ఇష్టం. ఇక కోట శ్రీనివాసరావు విలనీ యాజ్ యూజ్ వల్ గానే వుంది. కొత్తగా పరిచియం అయిన విలన్ బాగానే చేసాడు. తనూరాయ్ ఒక పాటలో మెరిసి మాయమవుతుంది. ఇంకా ఇందులో చాలా పాత్రలే వున్నాయి గానీ అవి ఎందుకున్నాయో కూడా తెలియదు.

ఇక టెక్నికల్ గా ఈ చిత్రం గురించి . . . ఎంచుకొన్న కధ కుసింత వెరైటీ గా వున్నా లాజికల్ గా మాత్రం లేదు. అయితే దానిని చెప్పిన విధానం అస్సలు బాగోలేక పోవడం వల్ల కధ కూడా ఏం బాలేదు అనిపిస్తుంది. కొన్ని కొన్ని చోట్ల దర్శకుడి గా సుధాకర్ నాయుడు టేకింగ్స్ అయితే బానే వున్నాయి. మణిశర్మ మ్యూజిక్ ఈ చిత్రానికి కొంచం ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. పాటలు వినడానికి, చూడడానికీ (కానీ చాలామంది పాటలు వచ్చే టైమ్ లో బయటకు వెళ్ళి పోతున్నారు అన్నది వేరే విషయం) కూడా బావున్నాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బావుంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ఇంకా క్రిస్ప్ గా వుంటే బావుండేది. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బావుంది. అలాగే ఆనంద్ సాయి వేసిన సెట్ లు కూడా చాలా రిచ్ గా బావున్నాయి. ఈ చిత్రం లో తప్పని సరిగా చెప్పవలసింది ప్రొడక్షన్ వాల్యూస్ గురించి. సినిమా మొత్తం రిచ్ గా కనబడేలా నిర్మాత మన్యం రమేష్ పెట్టిన ఖర్చు తెరమీద కనబడుతుంది. ఇక కనల్ కన్నన్ కంపోజ్ చేసిన స్టంట్స్ కూడా బానే వున్నాయి. టోటల్ గా సినిమా ఏంట్రా పరిస్తితి అంటేనే సమాధానం లేదు. ఇటీవలి కాలం లో వస్తున్న కొన్ని కొన్ని సెన్సిబుల్ మూవీస్ ని చూసి అన్నా మన దర్శకులు మారితే ఎంత బావుణ్ణో కదా అనిపించింది సినిమా పూర్తి అయ్యి బయటకు వస్తున్నప్పుడు. ఇక రెవెన్యూ పరం గా ఈ చిత్రం గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేం. అయితే బి , సి , సెంటర్లలో కొద్దిగా మంచి కలెక్షన్లను రాబట్టుకొనే అవకాశం కూడా వుందనే చెప్పాలి.


Post your review
Only registered users can rate the film. To rate the film please login
Login Password Register? Forgot passwd?
(Scale: 1-Worst/Avoid 2-Below Average 3-Average/one see 4-Good/Must see 5-Excellent)
Subject/Headline
Comment
User Reviews
No comments posted so far
Syndicate  |   Contact us  |   Disclaimer  |   Feedback
Copyrights 2002-2006 TOTALTOLLYWOOD.COM. ALL RIGHTS RESERVED.