TotalTollywood Logo
16 Apr 2014
Login Password Register? Forgot passwd?

Hare Ram
Movie Review : 3/5
by


Movie Links
Hare Ram (18/07/08)
After Kantri, Pandurangadu, it will be Hare Ram. (28/06/08)
Hare Ram audio on 28th June (26/06/08)
Hare Ram - Kalyan Ram - Movie Stills
Hare Ram Audio Release - Events
Hari Ome - Movie Stills
User Reviews 4
Post your review
Movie Review
Average User rating: 3చంద్రమోహన్, సుధ దంపతులకు సియామీస్ కవలలు పుడతారు (తలలు అతుక్కొని పుట్టడం). అయితే డాక్టర్ వారిని విజయవంతం గా విడదీయగలుగుతాడు. కానీ ఒక బాబు కి మాత్రం మెడుల్లా అబ్లంగేటా సరిగ్గా ఎదగక పోవడం వల్ల భవిష్యత్ లో అతని వల్ల సమస్యలు ఎదురు అవుతాయని అతన్ని కొంచం జాగ్రత్త చూసుకోవాలని చెబుతాడు. హరి, రాం లు గా పిలవబడే ఆ పిల్లల్లో హరి బాగా తెలివైన వాడుగానూ రాం తెలివితక్కువవాడిగానూ వుంటారు. అయితే తనకన్నా తెలివైన వారిని చంపేద్దామన్నంత కోపం రాం లో పెరుగుతూ వుంటుంది. దాని వల్ల తన అన్న అయిన హరి ని కూడా చంపడానికి చూస్తాడు. రాం వల్ల హరి కి ప్రమాదం వుంటుందని హరి ని బయటకు నెట్టేస్తాడు తండ్రి. అయితే బిడ్డ మీద మమకారం చంపుకోలేని తల్లి రాం ని తీసుకొని వారికి దూరం గా వెళ్ళిపోతుంది. హరి(కళ్యాణ్ రాం) పెరిగి పెద్దవాడై పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ప్రస్తుతానికి వస్తే ఆరోగ్య శాఖామంత్రి శివా రెడ్డి (కోట) తన డాక్టర్ తమ్ముడు (రాజీవ్ కనకాల) సహాయం తో ఒక ప్రాణాంతక వైరస్ ని కనిపెట్టి దానికి విరుగుడు ను కూడా కనిపెట్టి దాన్ని ప్రజల్లో వ్యాపింపజేసి డబ్బు చేసుకొనే పధకాన్ని రచిస్తాడు. అతనికి టి.వి.10 అధినేత సూర్యప్రకాష్ (అశోక్ కుమార్) తన ఛానలో ద్వారా అన్ని విధాలా తోడ్పడుతూ వుంటాడు. కొన్ని కొన్ని సంఘటనల తర్వాత ఆ ఇద్దరి తమ్ముళ్ళూ అతి దారుణం గా చంపబడతారు. ఆ హత్యల వెనుక రామ్ (కళ్యాణ్ రాం) హస్తం వున్నట్లు గా తెలుస్తుంది. తన కన్న తెలివైన వాళ్ళని చంపే మనస్తత్వం వున్న రామే ఈ హత్యలు చేస్తున్నట్లుగా పోలీసులు నమ్మి అతన్ని పట్టుకొనే బాద్యత హరి మీద పెడతారు. అయితే ఈ హత్యల విషయం పరిశోధించడానికి సి.బి.ఐ. రంగం లోనికి దిగి ఆ హత్యలు చేసింది రాం కాదని హరి అని తేలుస్తుంది. కధ లో మొదటి అర్ధ భాగం ఇక్కడితో ముగుస్తుంది. ఇక్కడనుండీ కధ అనేకానేక మలుపులు తిరుగుతుంది. అసలు ఆ హత్యలు చేసింది రామా, హరా, అసలు వారిని ఎందుకు చంపాల్సి వచ్చింది. ఆరోగ్య శాఖ ను నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యం తో ఆటలాడుకొనే శివారెడ్డి ఏమయ్యాడు, రాం మనస్థత్వం లో మార్పు వచ్చిందా, హరి తన తల్లి ని కలుసుకొన్నాడా వంటి సంగతులు తెలుసుకోవాలంటే హరే రాం చిత్రాన్ని చూడాల్సిందే.

ఇక నటీ నటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఒక తెలివైన హరి పాత్రలోనూ తెలివి లేకుండా ఒకింత సైకో గా కనిపించే రాం పాత్రలోనూ కళ్యాణ్ రాం నటన చాలా ఆకట్టుకొనే విధం గా వుంది. నిజానికి ఈ రెండు పాత్రలూ ఒకదానికొకటి విభిన్నమైనవి. అయితే రెండు పాత్రలలోనూ ఆ వైరుధ్యాన్ని చూపించడం లో కళ్యాణ్ రాం సఫలీ కృతుడయ్యడు అనే చెప్పాలి. అలాగే ఈ చిత్రంలో కళ్యాణ్ రాం వాచకం కూడా చాలా బాగుంది. డ్యాన్సు ల లో గానీ ఫైట్స్ లో గానీ తనదైన ఒక డిఫరెంట్ స్టైల్ ని ఈ చిత్రం లో కళ్యాణ్ రాం ప్రెజెంట్ చేయగలిగాడు. తన మునుపటి చిత్రాలకన్నా ఈ చిత్రం లో అతను చాలా అందం గా కనిపించడం విశేషం. చిత్రం మొదటి అర్ధ భాగం లో మామూలు అల్లరి అమ్మాయి గానూ రెండవ అర్ధ భాగం లో పవర్ ఫుల్ ఆఫీసర్ పాత్రలోనూ ప్రియామణి నటన ఆకట్టుకొంటుంది. చిత్రం చివర్లో వచ్చే ఒక ర్యాప్ సాంగ్ లో ఆమే చాలా గ్లామరస్ గా కనిపిస్తుంది. చిత్రం లోని ఒక పెద్ద మలుపు కు కారణమయ్యే పాత్రలో సింధూ తులానీ (అతనొక్కడే చిత్రం లో హీరోయిన్ గా చేసినందువల్లనేమో) పాత్ర చాలా బాగా మలచబడింది. ఇక కోట, అశోక్ కుమార్, రాజీవ్ కనకాల, చంద్రమోహన్, చలపతిరావ్, సీత తదితరులు వారి వారి పాత్రలకనుగుణం గా నటించారు. ఇక కామెడీ ని పండించే బాద్యతను ఆలి, బ్రమ్మానందం, వేణుమాధవ్ లు తీసుకొన్నారు. అయితే వీరిలో కొంతలో కొంత బ్రమ్మానందం పాత్ర మాత్రమే హాస్యాన్ని జనరేట్ చేయగలిగింది.

సాంకేతిక శాఖ ల గురించి: ముందుగా ఈ చిత్ర కధ గురించి చెప్పాలంటే ఇది వరలో వచ్చిన మన్మధ చిత్రానికి దీనికి కొన్ని పోలికలున్నాయని చెప్పవచ్చు. అయితే ఒక మామూలు కధ ను ముందుకు తీసుకు వెళ్ళడానికి వీరు ఎంచుకొన్న మలుపులే దీనిని ఒకింత ఆకర్షణీయం గా మార్చాయి అని చెప్పాలి. నిజానికి సినిమా మొదటి అర్ధభాగం లో కధనం చాలా మెల్లిగా ఇంకా చెప్పాలంటే నత్తనడక నడిచింది అనే చెప్పాలి. ఈ చిత్రానికి ప్రాణం అంతా సెకెండ్ హాఫ్ లోనే వుంది. దర్శకత్వ పరం గా హర్షవర్ధన్ కొన్ని కొన్ని షాట్ లలో కొత్త దనాన్ని తీసుకు రాగలిగారు గానీ కధనం విషయం లో మాత్రం ఆ కొత్తదనం కొంత కూడా కనబడలేదు. ఈ విషయం లో గనుక తగిన జాగ్రత్తలు తీసుకొని వుండి వుంటే ఈ చిత్రం మరింత ఆకర్షణీయం గా వుండేది. అలాగే ఈ చిత్రానికి సంభాషణ ల పరం గా కూడా పెద్ద మేలు ఏమీ జరగలేదు. కళ్యాణ్ రాం సినిమాల్లో వుండే పవర్ ఫుల్ డైలాగులు ఒక్కటి కూడా ఈ చిత్రం లో కనబడలేదు. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం గానీ సీతారామ శాస్త్రి గారు అందించిన సాహిత్యం గానీ చాలా బావున్నాయి అని చెప్పాలి. మరీ ముఖ్యం గా సినిమా చివర్లో వచ్చే "ఇంకొంచం ఫ్రీడం ఇచ్చేసుకొందాం" పాట అద్బుతం గా వుందని చెప్పాలి. అయితే పాట చిత్రీకరణ మాత్రం అంతగా ఆకట్టుకోదు. రాం ప్రసాద్ ఛాయాగ్రహణం చాలా బావుంది. ఎడిటింగ్ బాగానె వుంది. సెల్వ, రామ్ లక్ష్మణ్ ల స్టంట్స్ నిజం గా ఆకట్టుకొనే రీతి లో వున్నాయి. ఇక ముఖ్యం గా చెప్పల్సింది ప్రొడక్షన్ వాల్యూస్ గురించి, చిత్రం మొదటి నుండీ చివరి వరకూ చాలా లావిష్ లుక్ తో వారు పెట్టిన ఖర్చు క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే ఈ చిత్రం లో చాలా మాటలు సెన్సార్ వారి బారిన పడ్డాయి. చాలా చోట్ల రెడ్డి, నక్సలైట్ ఇలాంటి చాలా పదాల వాయిస్ ని కట్ చేయడం జరిగింది. మొత్తం మీద హరే రాం చిత్రం మంచి ఓపెనింగ్స్ తోనే మొదలైనా ఈ చిత్రం కమర్షియల్ గా ఎంతవరకూ సక్సస్ అవుతుందన్నది రానున్న రోజుల్లో తెలియాల్సి వుంది.


Post your review
Only registered users can rate the film. To rate the film please login
Login Password Register? Forgot passwd?
(Scale: 1-Worst/Avoid 2-Below Average 3-Average/one see 4-Good/Must see 5-Excellent)
Subject/Headline
Comment
User Reviews
Total number of reviews - 4

once watch
by vamsi on 2008-07-27
Rating: 3

can watch it once

Good
by anon user on 2008-08-01
Rating:

Very good movie .


by anon user on 2008-08-14
Rating:

movie is superb,kalyan ram rockssssssssss

below avg
by anon user on 2008-08-11
Rating:

not bad but able 2 see once

SEE ALL REVIEWS >>
Syndicate  |   Contact us  |   Disclaimer  |   Feedback
Copyrights 2002-2006 TOTALTOLLYWOOD.COM. ALL RIGHTS RESERVED.