Sowryam Movie Review : 2.5/5 by
సినిమాటోగ్రాఫర్ గా తనను తాను ప్రూవ్ చేసుకొన్న టెక్నీషియన్ శివ కుమార్. ఈ చిత్రం తో దర్శకుడి గా మారాడు. దర్శకుడి గా తొలి చిత్రమే అయినా ఆ భావన ప్రేక్షకుడి కి యెక్కడా కలగలేదంటే అది శివకుమార్ గొప్పదనమే అని చెప్పాలి. ఇక శౌర్యం గురించి ఒక్క ముక్క లో చెప్పాలీ అంటే ఇది ఒక టిపికల్ గోపీచంద్ సినిమా. కావాల్సినంత వినోదం, బోల్డు యాక్షన్, కొంచం సెంటిమెంట్ ఇంక అంతే. ఒక కమర్షియల్ (తెలుగు) సినిమాకి ఇంతకన్నా ఏం కావాలి. ఈ రోజూ రేపూ
హీరో విలన్ని కొట్టును కాన్సెప్ట్ తో వచ్చే అనేకానేక సినిమాల్లో ఇదీ ఒకటి. గొప్పగా చెప్పుకోవడానికి అంటూ ఏమీ లేకపోయినా డబ్బులు తెచ్చిపెట్టే సినిమాలు ఇవే కదా. ఈ సినిమాలో హీరో చెల్లెలి కోసం విలన్ కొడతాడు అంతే. ఇక కధ గురించి చెప్పుకోవాలంటే ఎన్ కౌంటర్ చేయబడ్డ ఒక రౌడీ షీటర్ పిల్లలు విజయ్, దివ్యలు. తండ్రి చనిపోవడం తో దిక్కులేని వారవుతారు. చెల్లెలు దివ్య ఆకలేస్తుంది అంటే అన్నం కూడా పెట్టలేని అన్న విజయ్ ఆమెను ఒక అనాధ ఆశ్రమానికి వదిలేస్తాడు. కానీ చెల్లెలంటే అపారమైన ప్రేమ అతని గుండెల్లో వుండిపోతుంది. రౌడీ షీటర్ కొడుకైన ఈ విజయ్ ఒక పోలీస్ ఆఫీసర్ (శరత్ బాబు) సాయం తో ఎ.సి.పి. విజయ్ (గోపీచంద్) గా మారతాడు. ఇక మామూలే నగరం లో అందరినీ ఒణికించే అతి పెద్ద గూండా అయిన శివరాం గౌడ్ (మనోజ్ కె జైన్) తో గొడవ. తనని భయపెట్టడానికి తనకు ఎవరూ లేరని చెప్పి శివరాం గౌడ్ ని ఒక ఆట ఆడుకొంటాడు విజయ్. అయితే విజయ్ ప్రాణప్రదం గా ప్రేమించే ఒక చెల్లెలు వుందని శివరాం గౌడ్ తెలుసుకోవడం, ఇక అక్కడనుండీ ఆమెను అడ్డం పెట్టుకొని విజయ్ మీద కక్ష సాధించాలన్న గౌడ్ ప్రయత్నం. దానిని విజయ్ ఎదుర్కోవడం ఇంక ఆ తర్వాత జరిగెవన్నీ మామూలే. మన తెలుగు సినిమాకి ఇంత కన్నా కధ అవసరం లేదు కదా. మద్యలో హీరోయిన్ తో రొమాన్సూ, నాలుగైదు పాటలు అంతే సినిమా అయిపోయింది. ఇక మీకు అన్నీ డీటైల్డ్ గా అంటే విజయ్ దివ్యని ఎలా కలిసాడు, మద్యలో హీరోయిన్ ఎక్కడనుండి వచ్చింది, విలన్ నుండి చెల్లెలిని మన హీరో అన్న ఎలా కాపాడుకొన్నాడు లాంటివి కావాలీ అంటే తప్పకుండా ధియేటర్ కి వెళ్ళి శౌర్యం సినిమా చూడాల్సిందే.
గోపీచంద్ ప్రతి సినిమాలోనూ బాగానే చేస్తాడు. అయితే ఈ సినిమాలో గోపీచంద్ చేసిన కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. సినిమా ఫస్ట్ హాఫ్ లో దాదాపు అన్ని సీన్ లూ ముఖ్యం గా ఆలీ తోనూ, అనూష్క తోనూ చేసిన సీన్లు బాగా నవ్వుతెప్పించాయి. అలాగే సెకెండ్ హాఫ్ లో కూడా శివరాం గౌడ్ ని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించే సీన్లు కూడా కొంచం కొత్తగా వుండడమే కాకుండా చాలా బావున్నాయి అని చెప్పవచ్చు. ఇక క్రోధం గానీ కోపం గానీ పవర్ గానీ చూపించాలీ అంటే నేనున్నదే అందుకు అనిపించేలే చేస్తాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో డ్యాన్స్ కూడా చాలా బాగా చేసాడు. గోపీచంద్ స్పెషల్ ఫైట్స్ ఇందులో చాలానే వున్నాయి. టోటల్ గా గోపిచంద్ ఈ చిత్రం లో ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ ని ప్రదర్శించాడు. ఇక అనూష్క . . . ఈ అమ్మాయి రోజు రోజుకీ అందం గా తయారైపోతుంది. మరి అందులో వున్న రహస్య మేంటో గానీ ఈ సినిమాలో అందం గా వుండడమే కాదు ఫస్ఠ్ హాఫ్ అంతా విపరీతమైన కామెడీ ని పండించేసింది. మరి వారిద్దరి మద్యనా ఏముందో ఏమో గానీ కెమెస్ట్రీ మాత్రం చాలా బాగా వర్క్ అవుట్ అయ్యింది. పూనమ్ కౌర్ చేసిన దివ్య పాత్ర మీదనే సినిమా అంతా తిరిగినా ఆమె పెర్ఫార్మ్ చేయడానికి తగినంత స్కోప్ లేకపోయింది. కానీ క్లైమాక్స్ లో మాత్రం చాలా చక్కగా చేసింది. శివపురం చిత్రం ద్వారా పరిచితుడైన మనోజ్ కె జైన్ మాత్రం శివరాం గౌడ్ పాత్రకు ప్రాణం పోసాడని చెప్పాలి. మరీ ముఖ్యం గా సెకెండ్ హాఫ్ లో అతను చాలా బాగా చేసాడు. ఇక శివరాం గౌడ్ కొడుకు పాత్రలో అజయ్ తనదైన శైలి లో సెటిల్డ్ గా చేసాడు. కామెడీ పార్ట్ ని ఫస్ట్ హాఫ్ లో క్యారీ చేసిన ఆలీ గానీ సెకెండ్ హాఫ్ లో క్యారీ చేసిన కృష్ణభగవాన్, రఘుబాబు లు గానీ ప్రేక్షకులచేత నవ్వించగలిగారు. చివర్లో కనబడిన ఎమ్.ఎస్.నారాయణ కూడా బాగా చేసారు. ఇక మిగతా పాత్రల్లో తనికెళ్ల భరణి, ధర్మవరపు, సుధ తదితరులు పాత్రోచితం గా నటించారు.
ఇక టెక్నికల్ విభాగానికి వస్తే శివకుమార్ ఎంచుకొన్న కధ సాదాసీదాదే అయినా కధనం బావుంది. సీన్ల అల్లిక సరిగ్గానే కుదిరింది. కామెడీ మీద ఇతనికి కొంచం మంచి పట్టే వున్నట్లు అనిపిస్తుంది. సీన్లు మెచ్యూర్డ్ గానే వున్నాయి. టోటల్ గా శివకుమార్ ఈ సినిమాతో దర్శకుడి గా పాస్ అయిపోయాడనే చెప్పాలి. వెట్రి సినిమాటోగ్రఫీ బావుంది. ఇక మార్తాండ్ ఎడిటింగ్ కూడా స్లీక్ గా మూవీ మంచి పేస్ తో వెళ్ళేందుకు అనుకూలం గా వుంది. మనిశర్మ మ్యూజిక్ పాటల వరకూ ఓకె లా వున్నప్పటికీ రీ రికార్డింగ్ మాత్రం చాలా బావుంది. అలీ సీన్ల కి వాడిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా నవ్వు తెప్పిస్తుంది. విజయ్ కంపోజ్ చేసిన ఫైట్స్ బావున్నాయి. వివేక్ వేసిన సెట్స్ సొ సొ గా వున్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఆర్ ఓకె. పెట్టిన ఖర్చు తెరమీద చూపించగలిగారు. ఇక ఎమ్.రత్నం మాటలు బావున్నాయి గానీ కొన్ని కొన్ని డైలాగ్ లు సెన్సారు వారిని దాటి తెరమీదకు రాలేదు. టోటల్ గా శౌర్యం కూడా లక్ష్యం లా మారి పోయే అవకాశాలు ఎక్కువగానే వున్నాయని చెప్పవచ్చు. ఈ సినిమాకి పాజిటివ్స్ ఏంట్రా అంటే చక్కని డీసెంట్ కామెడీ, మెయిన్ లీడ్ పెర్ఫార్మెన్స్, గుడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లు గా చెప్పుకొంటే నెగిటివ్స్ లోనికి ఈ చిత్రం క్లైమాక్స్, పాత కధ ఇటువంటివి వస్తాయి. ఏది ఏమైనా ఈ చిత్రానికి ఓపెనింగ్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి. అలాగే మంచి మౌత్ టాక్ కూడా స్ప్రెడ్ అవ్వడం వల్ల డెఫినెట్ గా ఈ చిత్రం రెవెన్యూ పరం గా బాగానే ఆడే సూచనలు కనబడుతున్నాయి.
Only registered users can rate the film. To rate the film please login
(Scale: 1-Worst/Avoid 2-Below Average 3-Average/one see 4-Good/Must see 5-Excellent)
|
Total number of reviews - 3
good 5 by anon user on 2008-09-25 Rating:
its good movie to watch |
sowryam by anon user on 2008-09-25 Rating:
very nice movie...action packed entertainer |
by anon user on 2008-10-03 Rating:
avg movie...
sister sentiment movie..
avoid this movie.. wait for cds... |
SEE ALL REVIEWS >> |
|
|
|
|
|
|
|
|
Copyrights © 2002-2006 TOTALTOLLYWOOD.COM. ALL RIGHTS RESERVED.
|
| |